కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు. అనూహ్య ఎంపిక..!?
ఏపీలో రాజకీయ లెక్కలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ లు పావులు కదుపుతున్నాయి. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి పార్టీలు రాజ్యసభ అభ్యర్దుల ఖరారు పైన ఒక అంచనాకు వచ్చాయి. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అందులో మూడు పార్టీలు సీట్లను పంచుకోవటం పైన లెక్క ఖరారైంది. అదే విధంగా అభ్యర్దులు దాదాపు ఫిక్స్ అయ్యారు.
ఏపీ నుంచి రాజ్యసభలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు సీట్లు కూటమి కే దక్కనున్నాయి. దీంతో.. ఈ నాలుగు సీట్లలో రెండు టీడీపీ, బీజేపీ- జనసేన చెరో సీటు దక్కేలా నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం వైసిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, టిడిపి నుంచి సానా సతీష్ పదవీ కాలం వచ్చే జూన్ 21తో ముగియనుంది. వీరిలో టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో సానా సతీశ్ కు తిరిగి రెన్యువల్ చేయాలని దాదాపు నిర్ణయించారు. టీడీపీకి మరో సీటు దక్కనుంది. ఆ సీటును భారత్ బయోటెక్ సంస్థ అధినేత యల్లా కృష్ణ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ.. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సైతం రేసులో ఉన్నారు. అదే విధంగా బీజేపీ నుంచి ఒక స్థానానికి అవకాశం కల్పించగా..తమిళనాడులో కీలక నేతగా వ్యవహరిస్తూ ఇటీవలి ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉన్న అన్నామళైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని బిజెపి అధినాయకత్వం డిసైడ్ అయి నట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలోనూ అన్నామలైకు స్థానం దక్కే అవకాశం ఉంది.

మూడు పార్టీలకు ప్రాతినిధ్యం
ఇక జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ను పంపాలని దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మేరకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. జనసేన పార్టీ కార్యాలయం విజయవాడ కేంద్రంగా కొంతకాలం నడించింది. ఈ నివాసం కూడా రమేష్‌దేనని చెబుతారు. దీంతో రమేష్ అభ్యర్ధిత్వానికి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే లింగమనేని విషయంలో టీడీీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కూటమి నుంచి ఎంపిక చేసే నాలుగు స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో జనసేన నుంచి అల్లు అరవింద్ పేరు సైతం ప్రచారంలో ఉంది. ఈ విషయంలో పవన్ కల్యాన్ చివరకు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ నుంచి రాజ్యసభ రేసులో ప్రముఖులు ఉండటంతో.. కూటమి నుంచి ఖరరాయ్యే పెద్దల సభ అభ్యర్దుల విషయంలో ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications