ర్యాలీలు, దీక్షలతో అట్టుడుకుతున్న ఉత్తరాంధ్ర-అమరావతి అంటే తరిమికొట్టాలన్న తమ్మినేని

ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు అంతకంతకూ ముదురుతోంది. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో ప్రారంభమైన వైసీపీ నిరసనలు ర్యాలీలుగా, దీక్షలుగా మారుతున్నాయి. నాన్-పొలిటికల్ జేఏసీ వీటికి ప్లాన్ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉద్యమం తీవ్రమవుతోంది.

ఏపీలో మూడు రాజధానులు కావాలంటూ పెందుర్తి నియోజక వర్గం వేపగుంటలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు మద్దతుగా అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని,ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అనువైన ప్రాంతంగా గుర్తించి సీఎం జగన్ బిల్లు పెడితే.. టీడీపీ బినామీ రియల్ ఎస్టేట్ రైతులను రెచ్చగొడుతూ పాదయాత్ర పెట్టడం సిగ్గుచేటన్నారు. ఒక్క అమరావతిని రాజధానిగా చెయ్యమని అడగడం ఎంతవరకు సమంజసమన్నారు. చంద్రబాబు చుట్టూ ఉన్న 150 మంది రియల్ ఎస్టేట్ రైతులకోసమే పాదయాత్ర చేయిస్తున్నారని వారు ఆరోపించారు. అటువంటి బినామీ రైతులు విశాఖలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించారు..

rallies and deekshas in northern andhra for three capitals-speaker tammineni warning

అటు విశాఖ రాజధానిగా కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాల్లోనీ పలు నియోజకవర్గాల్లో ర్యాలీలు మానవహారాలు జరుపుతున్నారు. చోడవరం నియోజకవర్గంలో తాజాగా ప్రజలు పెద్ద ఎత్తున విశాఖ రాజధానికి మద్దతుగా కదం తొక్కారు. భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి విశాఖ ను రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటికే విశాఖ రాజధానికి మద్దతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన రాజీనామా పత్రాన్ని జేఏసీ నేతలకు ఇచ్చారు.

మూడు రాజధానులు జగన్ కోరుకున్న అభివృద్ది శంఖారావమని స్పీకర్ తమ్మినేని తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటానికే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారన్నారు. భూమి కోసం, భుక్తికోసం, నిరుపేదల హక్కుల కొసం పొరాడిన నేల ఉత్తరాంధ్రని, సిఎం జగన్మోహాన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని స్పీకర్ తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందన్నారు. మూడు రాజధానులు వర్దిల్లాలని ముందుకు వెళతామని తమ్మినేని ప్రకటించారు. తాళి కట్టిన ఆడది , మొలతాడుకట్టిన మగాడు , మీసం మొలిసిన యువకులంతా యువకులు రొడ్లు మీదకు రావలసిందేనన్నారు. అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల‌ నుంచి తరిమి తరిమి కొట్టాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+