పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వాసులకు మెగా ఫ్యామిలీ శుభవార్త!!

పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం.. పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముందు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.

పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి మెగా ఫ్యామిలీ నిర్ణయం
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పైన ఫోకస్ చేశారు. ఇక రానున్న వినాయక చవితి పండుగకు పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా మట్టి వినాయకులనే పూజించాలని పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి తాజాగా మెగా ఫ్యామిలీ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది.

Ram charan upasana said good news to the residents of Pithapuram for Pawan Kalyan

పిఠాపురం వద్ద భూములు కొనుగోలు చేసిన రాం చరణ్
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య పదిన్నర ఎకరాలు రామ్ చరణ్ కొనుగోలు చేశారు. రెండు ఎకరాలలో ఆసుపత్రి నిర్మాణం చేసి, మిగిలినదంతా ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని రామ్ చరణ్ ఉపాసన దంపతులు భావిస్తున్నారు. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఆ హామీని తీర్చడానికి మెగా ఫ్యామిలీ తన వంతుగా ఈ నిర్ణయం యీసుకుంది.

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మెగా ఫ్యామిలీ శుభవార్త
ఆస్పత్రి నిర్మాణంలో భాగంగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో భూమిని కొనుగోలు చేశారన్న వార్త స్థానికులకు శుభవార్త . ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందనున్నాయి. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరగనుంది.

నియోజకవర్గ ప్రజల హర్షం
రామ్ చరణ్ ఉపాసన దంపతులు తీసుకున్న నిర్ణయానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఓటేసి గెలిపించడం వల్లనే పిఠాపురం నియోజకవర్గంలో ఈ ప్రగతి జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే పనిలో ఉన్నారు మెగా ఫ్యామిలీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+