విశాఖ రైల్వే జోన్ బిల్లు: రామ్మోహన్నాయుడికి స్పీకర్ లేఖ

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ డిమాండ్ అయిన విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుపై బిల్లు పెట్టేందుకు అంగీకరిస్తూ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు ఓ లేఖ అందింది. లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గతంలో రామ్మోహన్‌ నాయుడు స్పీకర్‌కు లేఖ పంపారు.

ఈ నేపథ్యంలో లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయనకు తాజాగా లేఖ ద్వారా సమాచారం పంపింది. ఏపీ విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. రైల్వేజోన్‌ చట్టం -2017 పేరుతో బిల్లును ప్రతిపాదించేందుకు లోక్‌సభ సచివాలయం అంగీకారం తెలిపింది.

Ram mohan naidu received a letter from speaker about visakhapatnam railway zone bill

విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, వాల్తేరు డివిజన్లను కలిపి జోన్‌ ఏర్పాటుకు బిల్లు పెట్టనున్నారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వే శాఖ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that TDP MP Kinjarapu Ram mohan naidu on Monday received a letter from speaker about visakhapatnam railway zone bill.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి