పవన్ కల్యాణ్‌వి గొంతెమ్మ కోర్కెలంటారా?: కామినేనికి రామకృష్ణ ప్రశ్న

ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్లపై ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నేత రామకృష్ణ విరుచుకుపడ్డారు.

విజయవాడ: ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ బాసటగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించ లేకపోవడం అన్యాయమనీ, పవన్ కల్యాణ్ గొంతెమ్మ కోర్కెలేమీ కోరలేదని ఆయన అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. రైతుల దీనావస్థలు, ఆత్మహత్యలు, ప్రబలుతున్న వ్యాధుల గురించి పట్టించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేయడమే చంద్రబా బు చెబుతున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిదర్శనమా అని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన పవన్‌కల్యాణ్ కిడ్నీ వ్యాధుల బారినపడి అల్లాడుతున్న వారికి సహాయమందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా అవి ఆమోదయోగ్యం కానివిగా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నా రు. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మం ది కిడ్నీ బాధితులున్నారని ఆయన చెప్పారు.

Ramakrishna supports pawan kalyan on Udhanam issue

కిడ్నీ వ్యాధులకు గురై అనేకమంది ప్రా ణాలు కోల్పోవడం జరిగిందన్నారు. కిడ్నీ బాధితులకు బస్‌పాస్‌లు ఇవ్వాలని, మండలానికొక నెఫ్రాలజీ డాక్టర్‌ను నియమించమనీ, 100 కోట్ల రూపాయలను కేటాయించమని పవన్ క ల్యాణ్ అడిగితే దానికి కూడా ప్ర భుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.

పవన్‌వి గొం తెమ్మ కోర్కెలన్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ అదెట్లా సాధ్యమవుతుందని మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించటం శోచనీయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+