Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొట్ట ఎవరు నింపితే వారికే: జగన్‌ను కలిసిన రమణదీక్షితులు, 20ని.లు భేటీ, స్పందించిన టీడీపీ

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాదులో కలుసుకున్నారు. ఆయనతో దాదాపు ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు.

ఇక్కడకు తన కష్టాలు చెప్పుకోవడానికి వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. తనకు జరిగిన అన్యాయాన్ని జగన్‌కు వివరించానని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరించాలని ప్రయత్నించానని కానీ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు.

 జగన్‌ను కలిస్తే తప్పేంటి?

జగన్‌ను కలిస్తే తప్పేంటి?

శ్రీవారి కైంకర్యాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత జగన్‌ను కలిస్తే తప్పేమిటని రమణ దీక్షితులు ప్రశ్నించారు. గతంలో చంద్రబాబును కలవడానికి పలుమార్లు ప్రయత్నాలు చేశానని వెల్లడించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అపాయింటుమెంట్ ఇవ్వలేదని వాపోయారు.

నేనేం రాజకీయాలు చేయడం లేదు

నేనేం రాజకీయాలు చేయడం లేదు

ఇక్కడ నేనేమీ రాజకీయాలు చేయడం లేదని రమణ దీక్షితులు చెప్పారు. తాను గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వెల్లడిచారు. జగన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయం చెప్పి న్యాయం చేయాలని కోరానని చెప్పారు. ఆయన తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. అలాగే స్వామి వారి ఆభరణాలు కాపాడటం తన ధర్మం అన్నారు.

నా కష్టాలు వినే వారికి చెబుతా

నా కష్టాలు వినే వారికి చెబుతా

తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు ఎవరినైనా కలుస్తానని రమణ దీక్షితులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే వైసీపీ అధినేతను కలిశానని చెప్పారు. మిరాశీ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పారు. నా మీద విచారణ జరిపితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నా కష్టాలు ఎవరు వింటే వారికి చెబుతానన్నారు. సమస్యలు వినేందుకు తమకు ఏ పార్టీ అయితే ఏమిటన్నారు.

నా పొట్ట ఎవరు నింపితే వారికి మద్దతు

నా పొట్ట ఎవరు నింపితే వారికి మద్దతు

నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు అన్నం పెడుతున్నారా అని చూడనని, ఎవరు పెడితే వారికి నమస్కారం పెడతానని అన్నారు. అలాగే, తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరు సరిదిద్దితే వారికి మద్దతు ఉంటుందన్నారు. నా పొట్ట ఎవరు నింపితే (న్యాయం చేయడం) వారికి మద్దతు అన్నారు. రూలింగ్ పార్టీని న్యాయం చేస్తే వారికి కూడా నమస్కారం పెడతా అన్నారు. తనకు ఉన్నసౌకర్యాలు అన్నీ తీసి నడిరోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నా కష్టాలు తీర్చితే ఆయన ఫోటోను పెట్టుకొని దండం పెడతానన్నారు. మేం ప్రశాంతంగా స్వామివారికి పూజలు చేసుకోవాలని, కడుపు నిండా తినాలన్నారు.

రమణదీక్షితులు-జగన్ భేటీపై బోండా ఉమ స్పందన

రమణదీక్షితులు-జగన్ భేటీపై బోండా ఉమ స్పందన

జగన్‌ను రమణ దీక్షితులు కలవడంపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. ఆయన రాజకీయ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని మడిపడ్డారు. బీజేపీ మహా కుట్రలో ఇది కూడా ఓ భాగం అన్నారు. తిరుమల వెళ్లినప్పుడు చంద్రబాబు రమణదీక్షితులును చాలాసార్లు కలిశారని
చెప్పారు. చంద్రబాబును అపాయింటుమెంట్ అడిగానని చెప్పడం అవాస్తవం అన్నారు. ఏ ఉద్దేశ్యంతో అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయ్యారని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా స్వామివారి సేవలో ఉన్న ఆయన ఆఖరుకు వెంకన్నను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+