"అమరావతి" వెనుక సూత్రధారి రామోజీ..!!

రామోజీరావు కన్నుమూశారు. తెలుగు మీడియా రంగానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి. ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లో దాదాపుగా సక్సెస్ గా నిలిచిన వ్యాపారవేత్త. సక్సెస్ కు కేరాఫ్ గా చెప్పుకొనే రామోజీ రావు ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనిపించకపోయినా..పరోక్షంగా బలంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి నూతన రాజధాని కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అమరావతి ఖరారు వెనుక రామోజీ రావు కీలక పాత్ర పోషించారు.

ఏపీ రాజధాని
2014లో రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కొత్త రాజధాని ఖరారు కావాల్సి ఉంది. ఆ సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని ఏర్పాటు పైన నాడు చంద్రబాబుకు కేంద్రం నియమించిన శివరామక్రిష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో పాటుగా చంద్రబాబు మరో కమిటీ ఏర్పాటు చేసారు. నాడు ఏపీలోని 13 జిల్లాలకు సమదూరంగా ఉండేలా విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ప్రకటన చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీలో ప్రతిపాదించారు. అన్ని పక్షాలు అంగీకరించాయి.

Ramoji Rao major role behind finalisation of AP Capital name as Amaravati in Chandra Babu regime

రామోజీ సూచన
నాడు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందంతో మాస్టర్ ప్లాన్ సిద్దమైంది. 2019లో ప్రభుత్వం మార్పుతో అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే, చంద్రబాబు నాడు రాజధాని ఖరారు సమయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తన పత్రికలో ఒక వ్యాసం తానే సొంతంగా రాసారు. ఏపీ భవిష్యత్ రాజధాని ఎలా ఉండాలో..ప్రజల కలలు ఏంటో వివరించే ప్రయత్నం చేసారు. అందులో ఏపీ రాజధాని పేరు అమరావతిగా సూచించారు. ఈ పేరునే చంద్రబాబు ప్రభుత్వం నాడు రాజధానికి ఖరారు చేసింది. ఈ పేరును రామోజీ బహిరంగంగానే తన పత్రిక ద్వారా సూచించారు. రామోజీ సూచించిన అమరావతి ఇప్పుడు తిరిగి ఏపీ రాజధానిగా నిలవబోతోంది.

చంద్రబాబు ఆమోదం
నాడు తాను 2014లో సీఎం అయిన సమయంలో...ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే, రామోజీ పరిశోధన చేసి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా "అమరావతి" పేరు బాగుంటుంది అని చెప్తే, అందరి అభిప్రాయం తీసుకుని, "అమరావతి" అని మన రాజధాని పేరు పెట్టుకున్నామని చంద్రబాబు నాడు వెల్లడించారు. 2017లో జరిగిన తెలుగు దేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు. అమరాతి పేరు వినగానే అమృతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ పేరే ఖరారు చేసామన్నారు. ఇప్పుడు రామోజీరావు మరణంతో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నాడు చంద్రబాబు చెప్పిన ఈ విషయం వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+