రాజకీయాల్లోకి రావాలనే ఉంది, పుట్టుకతో రాదు: నటి రమ్యశ్రీ
విశాఖపట్నం: ప్రజలు ఆదరిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని సినీ నటి రమ్యశ్రీ చెప్పారు. ఆమె శుక్రవారం సబ్బవరంర వచ్చారు. ఈ సందర్భంంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
తనకు సాధ్యమైనంతవరకు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. రాజకీయం పుట్టుకతో రాదని, అనుభవం ద్వారా అది వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు తాను 300 సినిమాల్లో నటించినట్లు తెలిపారు.

ఓ మల్లితో గుర్తింపు
ఆమె 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. కన్నడంల నటించిన ఆర్యభట్ట సినిమాకు జాతీయ అవార్డు పొందారు. తెలుగు చిత్రం ఓమల్లి తనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిందని చెప్పారు

నటిగానే కాదు, ఇంకా..
నటనలోనే కాకుండా స్క్రీన్‌ప్లే, దర్శకత్వ రంగాల్లో కూడా తనకు అనుభవం ఉందని రమ్యశ్రీ చెప్పారు. నటనకు, దర్శకత్వానికి రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ జ్యూరీ నంది అవార్డు లభించింది చెప్పారు.

రమ్యశ్రీ సామాజిక సేవ
రమ్య హృదాలయ ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవలు చేస్తున్నట్ల చెప్పారు. నగరంలో నాలుగేళ్లుగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా పెరుగుతున్నా కూడా ప్రసవ సమయంలో మహిళలు మృత్యువాత పడుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు.

ఇలా చేయాలని...
గ్రామాల్లో గర్భిణులు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే ప్రసవ సమయంలో ఇబ్బందులుండవని రమ్యశ్రీ అన్నారు. బీపీ, షుగర్, స్త్రీ సమస్యలపై వైద్య శిబిరంలో ఉన్నత స్థాయి వైద్యలు పరీక్షలు చేస్తారని చెప్పారు. మంచి పాత్రలు వస్తే తప్పక నటిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications