పవన్‌తో భేటీ: జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే రాపాక?

తూర్పుగోదావరి: జిల్లాలోని రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఆయన మర్యాద పూర్వకంగా కలిసినప్పటికీ రాజోలు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని దాదాపుగా ఆయన అభ్యర్థిత్వం ఖాయమైనట్టు రాపాక అభిమానులు చెబుతుండటం గమనార్హం.

రెండురోజుల క్రితం జిల్లాకు చెందిన ఒక కీలక నేత జనసేన శ్రేణులకు మీరంతా వెళ్లి రాపాకను కలిసి పార్టీలోకి ఆహ్వానించమని సలహా ఇవ్వడం జరిగింది. దీంతో జనసేన నాయకులు వివిధ గ్రామాల నుంచి చింతలమోరి వెళ్లి రాపాకను కలిశారు.

 Rapaka Vara Prasad to Join in Pawan Kalyans Janasena Party

అయితే రాపాక రెండు రోజులు గడువు కోరడం, తదుపరి పవన్‌ కళ్యాణ్‌తో అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడంతో బుధవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా త్వరలో పార్టీలో చేరతారని రాపాక అభిమానులు తెలిపారు.

పవన్‌కల్యాణ్‌ను రాపాకతోపాటు మలికిపురానికి చెందిన కేఎస్‌ఎన్‌ రాజు తదితరులున్నారు. వీరంతా త్వరలోనే జనలో చేరనున్నట్లు సమాచారం. రాపాకతో తమ గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+