పిఠాపురంలో బాలికపై అత్యాచారం..సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ..?

ఏపీలో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.నంద్యాల జిల్లాలో ఓ చిన్నారిపై ముగ్గురు మైనర్ పిల్లలు అత్యాచారం చేసి, హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ బాలిక మృతదేహం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం నూతిపాడు గ్రామంలో విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.కాలేజీ ముగించుకొని ఇంటికి వెళుతున్న విద్యార్థినిని మరో ఇద్దరు స్నేహితుల సాయంతో బలవంతంగా బైక్ ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు.

తాజాగా మరో బాలికపై అత్యాచారం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడాడు. బాలికను ఆటోలో ఎక్కించుకుని ఊరు శివారుకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదులోకి తీసుకున్నారు. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి టీడీపీ నాయకుడని తెలుస్తోంది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్‌గా గుర్తించారు. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి టీడీపీ మాజీ కౌన్సిలర్. ప్రస్తుతం ఆమె పిఠాపురం టీడీపీ పట్టణ అధ్యక్షురాలుగా కూడా పని చేస్తున్నారు.

Rape of a girl in Pithapuram YCP questioned Pawan Kalyan

అత్యాచారం తర్వాత బాలిక అపరస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా, స్థానికులు దుర్గాడ జాన్‌‌ను పట్టుకుని ,అతన్ని పోలీసులకు అప్పగించారు. దుర్గాడ జాన్‌ను కేసు నుంచి తప్పించడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారంతో బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురంలో బాలిక అత్యాచారం ఘటనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ కరవైందని వైసీపీ అభిప్రాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+