దారుణం: మైనర్ బాలికపై రేప్, సహకరించిన మైనర్లు, అరెస్ట్
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలిలో ఐదేళ్ళ చిన్నారిపై అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇతడికి మరో ముగ్గురు సహకరించారు. వీరు కూడ మైనర్లే కావడం గమనార్హం.
దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఏపీ రాష్ట్రంలో సంచలనం కల్గించింది. ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి. నిందితుడు కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా తేతలిలో మైనర్‌పై గ్యాంగ్‌రేప్ చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

ఇంట్లో ఆడుకొంటున్న చిన్నారిని 15 ఏళ్ళ బాలుడు బయటకు తీసుకెళ్ళాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా రక్తస్రావానికి బాలిక గురైంది. అసలు విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడితో పాటు అతడికి సహకరించిన ముగ్గురు మైనర్లను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమెను తణుకు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నిర్వహిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!