చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

50 మందిపై మహిళలపై అత్యాచారం, ముఠా పట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Chittoor map
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో హత్యలు, అత్యాచారాలు చేసిన తొమ్మిది మంది సభ్యుల ముఠాను చిత్తూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాతో సంబంధాలు ఉన్న మరో నలుగురు వేర్వేరు కేసుల్లో ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నారు. సామూహిక అత్యాచారాలకు పాల్పడిన ఈ ముఠాను చిత్తూరు పోలీసులు ఆదివారంనాడు పట్టుకున్నారు.

ముఠా వివరాలను ఎస్పీ రామకృష్ణ ఆదివారం మీడియా ప్రతినిధులకు వివరించారు. నిరుడు డిసెంబర్ 1న పలమనేరు అటవీ ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ జవహర్‌నాయక్, హోమ్‌గార్డు దేవేంద్ర హత్యకేసు పరిశోధనకు ఏర్పాటుచేసిన బృందం రేపిస్ట్ ముఠాను అరెస్ట్ చేసి విచారించారు. ఈ సందర్భంగా పలు విషయాలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొన్ని సంఘటనలకు పోలీసులు కేసు నమోదు చేయగా పోలీసులకు ఫిర్యాదు అందని కేసులు కోకొల్లలుగా ఉన్నాయని రామకృష్ణ అన్నారు.

ఈ ముఠా తమిళనాడు రాష్ట్రం సేలం ప్రాంతానికి చెందింది. వీరికి స్థానికంగా కొంత మంది సహాయ సహకారాలు అందించారు. తమిళనాడుకు చెందిన వెళ్లాయన్(27), మురుగన్(25), రాఘవన్(27), గోవిందస్వామి(29), బొమ్మి అలియాస్ లక్ష్మి(35), చిత్తూరు జిల్లాకు చెందిన రామిరెడ్డి(29), రాజేంద్ర (34), ప్రతాప్(29), విజయకుమార్ (28)ను పలమనేరు అటవీ ప్రాంతంలోని బూతలబండ సమీపంలో చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్‌పి రామకృష్ణ తెలిపారు.

డిసెంబర్ 1వ తేది పలమనేరు సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ మహిళను తీసుకొని అడవిలోకి వెళ్లినట్లు పలమనేరు పోలీసులకు సమాచారం అందడంతో పోలీస్ కానిస్టేబుల్ జవహార్‌నాయక్, హోమ్‌గార్డు దేవేంద్ర వారిని అనుసరిస్తూ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆప్రాంతంలో ఈ దుండగులు ఉండడంతో వారిని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు. ఈ దుండగులు కానిస్టేబుల్‌ను, హోమ్‌గార్డును దారుణంగా హత్య చేశారు. ఈసంఘటన నేపధ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

నిరుడు డిసెంబర్ 16వ తేదీ పెనుమూరు మండలం నేండ్రగుంట-పెనుమూరు రాజా ఇండ్ల దగ్గర అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఓ ప్రేమజంటపై దాడి చేసి ఆటో డ్రైవర్‌ను కాళ్లుచేతులు కట్టి మహిళపై అత్యాచారం చేశారు. వారి వద్ద నుండి బంగారు నగలు, సెల్‌ఫోన్‌సిమ్‌కార్డు దోచుకెళ్లారు. వీటితోపాటు తమ ముఠాలోని పెరుమాళ్, సతీష్ అనే వారిని వీరందరు కలసి హత్య చేశారు. దుండగులు దాదాపు 50 మందికి పైగా మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్లు ఎస్‌పి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని వీరిపై 16కేసులు నమోదైయ్యాయి. అడిషనల్ ఎస్పీ అన్నపూర్ణ నేతృత్వంలో ఇద్దరు డిఎస్పీలు, ఆరుగురు సిఐలు, 20మందికి పైగా ఎస్సైలు ఈ కేసును ఛేదించారు.

English summary
A rapist gang has been nabbed in Chittoor district on sunday. 9 member gang has resorted sexual assault agaonst over 50 women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X