రూ.15 కోట్ల లంచం అడిగితే ఇవ్వరా: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
తనకు ఎక్కడైనా 140 కోట్ల రూపాయల విలువైన భూమిని రూ. 3 కోట్లకు ఇప్పిస్తే, తాను రూ.15 కోట్లు లంచం ఇస్తానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. 25 సంవత్సరాలు అధికారంలో ఉండి పరిటాల కుటుంబం చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాప్తాడులో వాల్మీకులను మోసం చేసి భూములను లాక్కున్నారని, గంగులకుంట చెరువుకు నీళ్లు ఇస్తామంటూ కురుబలను మోసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహం పెడతామని చందా అడిగితే ఎందుకివ్వాలంటూ దళితులను ఆవమానించారని తెలిపారు.
అంతకుముందు పరిటాల సునీత మాట్లాడుతూ కొన్ని పరిశ్రమలు హైదరాబాద్ కు తరలిపోయాయని, వైసీపీ నాయకుల ఒత్తిడివల్లే పరిశ్రమలు తరలిపోయాయన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఒత్తిడితోనే రాప్తాడు సమీపంలో జాకీ కంపెనీ వెనక్కు వెళ్లిపోయిందని సునీత చేసిన ఆరోపించారు.

"ఎవరికైనా రూ.140 కోట్ల విలువైన భూమిని రూ. 3కోట్లకే ఇచ్చినప్పుడు రూ. 15 కోట్లు లంచం అడిగితే ఇవ్వరా?. ఎందుకివ్వరు? మాజీ మంత్రి పరిటాల సునీత కనీసం జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? అని తోపుదుర్తి ప్రశ్నించారు. లోకేష్, సునీత అప్పటి ప్రభుత్వంలో చేసుకున్న చీకటి ఒప్పందాల్లో భాగంగా ప్రభుత్వ భూములను వివిధ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టారన్నారు. తాము పరిశ్రమలు తీసుకొచ్చామని, వైసీపీ వచ్చిన తర్వాత అవన్నీ వెళ్లిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. పదే పదే అబద్దాలను గోబెల్స్ ప్రచారం చేస్తుండటంతో వీరిగురించి ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications