విశాఖ ఇండస్‌లో అరుదైన గుండె చికిత్స(ఫొటో)

విశాఖపట్నం: నగరంలోని ఇండస్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. గుండెలో చీలిక ఏర్పడటంతో ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ జాన్‌వెస్లీ ఈ మేరకు వెల్లడించారు.

ఒడిశాలోని నవరంగ‌పూర్‌కు చెందిన దిలీప్ కుమార్ నాయక్(43)కు ఛాతీలో తీవ్రమైన నొప్పి, కాళ్లనొప్పులు, మూత్రపిండాల వైఫల్యం, కాళ్లకు రక్త సరఫరా జరగకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సెప్టెంబర్ 9న ఇండస్ ఆస్పత్రికి వచ్చారు.

Rare Surgery performed at Indus Hospital

దిలీప్ కుమార్‌నాయక్‌ను పరిశీలించిన డాక్టర్ జాన్‌వెస్లీ రోగికి ఎంఆర్ఐ, 2డీఎకో తదితర పరీక్షలు నిర్వహించారు. గుండెలోపల బృహద్దమని గోడలో వచ్చే ‘ఏ' రకం చీలిక వల్లే సమస్య ఉత్పన్నమైనట్లు గుర్తించారు. దీనికి అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్స అవసరమని కుటుంబసభ్యులకు తెలిపారు. వారి అంగీకారంతో అనస్థీషియా డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్‌తో కలిసి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు.

ఈ తరహా ఆరోగ్య సమస్య వేలమందిలో ఒకరిద్దరికి మాత్రమే వస్తుందని, వచ్చినవారిలో 80శాతం మంది వెంటనే చనిపోతున్నారని చెప్పారు. శస్త్ర చికిత్స సమయంలో రోగి శరీర ఉష్ణోగ్రతను 36 డిగ్రీల నుంచి 18 డిగ్రీలకు తగ్గించామని, అలాగే రోగి శరీరంలో రక్తప్రసరణకు 35నిమిషాలపాటు నిలిపివేశామన్నారు. మెదడుకు మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం రక్తప్రసరణ జరగకపోతే మెదడులోని కణాలు మృతి చెంది రోగికి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. ఇందుకోసం కృత్రిమంగా ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ సమస్యను మందులతో లేదా శస్త్ర చికిత్స ద్వారా నయం చేయవచ్చని, చీలిక స్థితిని బట్టి చికిత్సకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ తరహా శస్త్ర చికిత్స రాష్ట్రంలో ఇదే ప్రథమం అని డాక్టర్ చెప్పారు. రోగి ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నాడని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని తెలిపారు. సమస్యను

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+