ఏపీలో రేషన్ వాహనాల రద్దుపై నిరసనలు..రోడ్డెక్కిన ఆపరేటర్లు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం కొనుగోలు చేసిన వాహనాలను ప్రస్తుత కూటమి సర్కార్ తాజాగా రద్దు చేసింది. ఇంటింటికీ రేషన్ అందించిన ఈ వాహనాలను రద్దు చేసి వాటి స్ధానంలో రేషన్ షాపుల్లోనే ఇకపై లబ్దిదారులు రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఇలా మొత్తం 9600 రేషన్ వాహనాలు రద్దయ్యాయ. దీనిపై ఆపరేటర్లు భగ్గుమంటున్నారు.
రాష్ట్రంలో రేషన్ ఇంటింటికీ అందించే వాహనాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆపరేటర్లు రోడ్డెక్కుతున్నారు. వివిధ జిల్లాలో ఈ మేరకు నిరసనలు చేపడుతున్నారు. ఇవాళ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రేషన్ వాహనాల ఆపరేటర్లు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. రేషన్ వాహనాల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

రేషన్ వాహనాలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమలాపురంలో ఆపరేటర్లు చేపట్టిన ఆందోళనకు విపక్ష వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. ఎండీయూ వాహనాల ఆపరేటర్ల నిరసనకు సంఘీభావం తెలిపారు. జగన్ సర్కార్ హయాంలో ప్రవేశపెట్టిన రేషన్ వాహనాల్ని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన విమర్శించారు.వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన రేషన్ వాహన ఆపరేటర్లకు అండగా ఉంటామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications