రత్నాచల్ ఎక్స్ ప్రెస్ బోగీల్లో కీలక మార్పు- రేపటి నుంచే అమల్లోకి..!
విజయవాడ-విశాఖపట్నం మధ్య నిత్యం రాకపోకలు సాగించే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ (Ratnachal Express)లో దక్షిణ మధ్య రైల్వే కీలక మార్పు చేస్తోంది. ఈ మార్పును కూడా రేపటి నుంచే అమల్లోకి తెస్తోంది. విజయవాడ, విశాఖ నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ మార్పుతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.
ప్రయాణికులకు మెరుగైన భద్రత, సౌకర్యం అందించే ఉద్దేశంతో ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ (12718/12717)కు వాడుతున్న ఐసీఎఫ్ బోగీల స్ధానంలో ఎల్ హెచ్ బీ (లింకే హాఫ్ మన్ బుష్) బోగీలు అమర్చాలని రైల్వే నిర్ణయించింది. దీంతో
ప్రస్తుతం ఉన్న బోగీల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పు కూడా రేపటి నుంచే అమల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఎక్కే ప్రయాణికులు వీటిని గమనించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లో 18 ఛైర్ కార్ బోగీలు, 3 ఏసీ చైర్ కార్ బోగీలు, ఓ ప్యాంట్రీ కార్, 2 సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ దివ్యాంగుల బోగీలు కలిపి మొత్తం 24 కోచ్ లు ఉన్నాయి. రేపటి నుంచి చైర్ కార్ లు 12, థర్డ్ ఏసీ చైర్ కార్ లు 3, ప్యాంట్రీ కార్ 1, జనరల్ కోచ్ లు 4, సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ దివ్యాంగుల బోగీలు రెండు కలిపి మొత్తం 22 కోచ్ లు మాత్రమే ఉండబోతున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న 24కోచ్ ల స్ధానంలో ఇకపై 22 కోచ్ లు మాత్రమే ఉంటాయన్న మాట. ఇందులో 18 ఛైర్ కార్ ల స్ధానంలో ఇకపై 12 చైర్ కార్స్ మాత్రమే ఉంటాయి. వీటికి బదులు 4 జనరల్ కోచ్ లు వస్తాయి.












Click it and Unblock the Notifications