వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి రావెల రాజీనామా - అడుగులు ఆ పార్టీ వైపే : సీటుపైనే డైలమా..!!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించి కారణాలతో తాను పార్టీ నుంచి తప్పుుకుంటున్నట్లు లేఖలో వివరించారు. రైల్వే అధికారిగా పని చేసిన రావెల కిషోర్ బాబు,,తొలి నుంచి కాన్షీరాం శిశ్యుడిగా ఉండేవారు. అనూహ్యంగా 2014 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టిక్కెట్ దక్కించుకొని గెలుపొందారు.

టీడీపీ - జనసేన- బీజేపీ

టీడీపీ - జనసేన- బీజేపీ

అనూహ్యంగా తొలి సారిగా ఎమ్మెల్యే అవుతూనే 2014 లో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేసారు. తొలి నుంచి కాన్షీరాం శిశ్యుడిగా ఉన్న రావెల.. 2017 వరకు మంత్రిగా కొనసాగారు. అప్పట్లో చంద్రబాబు మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా.. రావెలను మంత్రి పదవి నుంచి తప్పించారు. దీంతో..అప్పటి నుంచి ఆయన పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. ఆ తరువాత టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరితను ఓడించారు.

తిరిగి టీడీపీ వైపు చూపు

తిరిగి టీడీపీ వైపు చూపు


అదే విధంగా 2019 ఎన్నికల్లో సుచరిత తిరిగి ప్రత్తిపాడు నుంచి గెలుపొందారు. ఇక, 2019 ఎన్నికల తరువాత బీజేపీలో చేరిన రావెల కిషోర్ బాబు..కొంత కాలంగా పార్టీ మార్పు అంశం పైన తర్జన భర్జన పడుతున్నట్లుగా చర్చ సాగుతోంది. ఆయన, తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆయనకు తిరిగి ప్రత్తిపాడు సీటు కోసం ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం. ప్రత్తిపాడు నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన డొక్కా మాణిక్య వర ప్రసాద్ ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.

బీజేపీకి రాజీనామా..చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా

బీజేపీకి రాజీనామా..చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా

దీంతో..తాను గతంలో పోటీ చేసి గెలిచిన ప్రత్తిపాడు నుంచి అవకాశం ఇవ్వాలని రావెల కోరినట్లుగా తెలుస్తోంది. టీడీపీలోకి రీ ఎంట్రీకి అంతా సిద్దమైందని.. సీటు గురించి హామీ లభిస్తే ఆయన టీడీపీలోకి రీ ఎంట్రీ ఖాయమని ప్రచారం సాగుతోంది. మహానాడు వేదికగా రావెల టీడీపీలో చేరే అవకాశం ఉందని మరో వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో..రావెల రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారు.. తన నిర్ణయం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనేది చూడాలి.

English summary
Ex Minister Ravela Kishore Babu resigned for BJP, He may preparing ground for Re entry in TDP as per sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X