షాకింగ్, రిజైన్ చేస్తా: మందకృష్ణపై బాబుకు రావెల కిషోర్ హెచ్చరిక! ఆ భయం వల్లేనా?
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత రావెల కిషోర్ బాబు అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన గురువారం చేసిన వ్యాఖ్యలు టిడిపిలో కలకలం రేపుతున్నాయి.
గుంటూరు: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత రావెల కిషోర్ బాబు అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన గురువారం చేసిన వ్యాఖ్యలు టిడిపిలో కలకలం రేపుతున్నాయి.
చదవండి: కంచ ఐలయ్యపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, ప్రభుత్వం అలా చేస్తే సరే: టిజి వెంకటేష్

అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా
తనకు పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని బాంబు రావెల కిషోర్ బాంబు పేల్చారు. ఇది చంద్రబాబుకు షాక్ అని చెప్పవచ్చు. ఎస్సీ వర్గీకరణ కోసం తాను ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.

మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తా, అడ్డుకుంటే
ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తానని రావెల కిషోర్ బాబు ప్రకటించారు. మందకృష్ణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఓ విధంగా చంద్రబాబుకు హెచ్చరిక అని చెప్పవచ్చు.

చంద్రబాబుకు హెచ్చరికనే
ఇటీవల పలు సందర్భాల్లో చంద్రబాబు బీసీ నేత ఆర్ కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుంచి వచ్చి వారు ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వారిని ఏపీకి రానీయవద్దని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మందకృష్ణను అడ్డుకుంటే రాజీనామా చేస్తాననడం చంద్రబాబుకు చేసిన హెచ్చరికలుగానే భావిస్తున్నారు.

రావెలకు టిక్కెట్ డౌట్ ఉందా, అందుకే ఇలాగా
రావెల కిషోర్ హఠాత్తుగా ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయనను ఇటీవల మంత్రివర్గం నుంచి తొలగించి, ఆయన స్థానంలో నక్కా ఆనందబాబును తీసుకున్నారు. దీంతో ఆయన ప్రాధాన్యత తగ్గింది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పైన అనుమానాలు ఉన్నాయేమోనని, అందుకే అలా ఎదురు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారని అంటన్నారు.












Click it and Unblock the Notifications