అంత ఇవ్వాలంటే కష్టంలేబ్బా... రవితేజ నిర్మాతల వెనకడుగు?

సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసే కథానాయకుడు రవితేజ. కెరియర్‎లో ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్‎లు కూడా వస్తాయి. మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ అయ్యాడు అనుకునే లోపే మరో డిజాస్టర్‎ని ఖాతాలో వేసుకుంటాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా చేసే రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్యతో వరుసగా రెండు హిట్లు సాధించారు.

వెంటనే రావణాసుర రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో పడింది. ఈ సినిమా ఫలితం తర్వాత రవితేజ చేయబోయే సినిమాలకు అతను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా అతని లేటెస్ట్ మూవీ మూవీ టైగర్ నాగేశ్వరరావు విడుదలై దాని ఫలితం చూసిన తర్వాత ప్రాజెక్టుల గురించి ఆలోచిద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ravi teja

అయితే రవితేజ మాత్రం టైగర్ నాగేశ్వరరావు సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియాస్థాయిలో మార్కెట్ పెంచుకోవచ్చనే యోచనలో రవితేజ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన తన దృష్టి మొత్తం టైగర్ పైనే పెట్టారు. అన్ని భాషల్లో ఈ సినిమాకు స్టార్ నటులతో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారు.

ravi teja

రాబిన్ హుడ్‎గా పేరు పొందిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‎గా ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‎లో, రవితేజ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్‎తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో రేణు దేశాయ్ నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. కృతిసనన్ చెల్లెలు నుపూర్ సనన్ తెలుగు పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెడుతోంది. హిందీలో గాయనిగా, నటిగా ఇప్పటికే ఆమె తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+