పొలిటికల్ పంచ్ పోస్ట్: నారా లోకేష్ అసహనమా, జగన్‌ పాత్ర ఉందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేసినందుకు ఇంటూరు రవికిరణ్ అనే పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను అరెస్టు చేయడంపై సోషల్ మీడియాలో మాటల యుద్ధమే జరుగుతోంది.

రవికిరణ్ అరెస్టును కొంత మంది ఖండిస్తుండగా, మరికొంత మంది సమర్థిస్తున్నారు. నారా లోకేష్‌ను విమర్శించినందుకు అతన్ని అరెస్టు చేయలేదని, చట్టసభను కించపరిచినందుకు అరెస్టు చేశారని కొంత మంది వాదిస్తున్నారు.

ఆయన అరెస్టును భావప్రకటనా స్వేచ్ఛను హరించడంగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటూరి రవికిరణ్‌కు అండగా నిలుస్తామని ప్రకటిస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఓ రాజకీయ కోణంలో నడుస్తోంది. అయితే, ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తున్న ఇంటూరి రవికిరణ్ అరెస్టుపై అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

Ravikiran's arrest pours opinion on social media

పెద్దల సభ గౌరవం కూడా.

1.ఒక వైకాప అనుకూల FB గ్రూపు వారిని పెద్దల సభని అగౌరవంగా చూపించినందుకు అరెస్టు చేసారు. అయితే పెద్దల సభ గౌరవం కూడా ముఖ్యమే. ఈరోజు అరెస్ట్ కన్నా ముందు వివరణ అడిగి ఉండాల్సింది. వారు బేషరతు క్షమాపణ చెబితే సరిపోయేది. ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలి. కానీ ఈ పొరపాటుని అలుసుగా తీసుకుని సాంఘిక మాధ్యమాన్ని అదుపులో ఉంచుకుందామని పాలకులు అనుకుంటే అది సాధ్యం కాదు.అన్నట్లు మరి సభలలో బూతులు తిట్టుకోవచ్చా? వారందరిపై చర్యలుండవా?

2.ఆ పై గ్రూపు , మరొక బాచ్ మాలాంటి వారి చిత్రాలను కూడా మార్ఫింగ్ చేసి అసహ్యంగా కులపరంగా కూడా హేళన చేసారు. అదే విధంగా తెదేపా అనుకూల గ్రూపు కూడా చేసింది. విమర్శలు అవీ తీవ్రంగా చేయవచ్చు తప్పులేదు. కానీ వ్యక్తిగత/ అలా అవాస్తవాలతో నీచంగా వెళ్ళకూడదని కోరుతున్నాను. ఏం.. ఆత్మాభిమానం ఎవరికి ముఖ్యంకాదు? అది ఆయా పక్షాలలో పెద్దల ద్రుష్టికి తీసుకు వెళ్ళిన తరువాత ఒక బాచ్ మినహా సవరించుకున్నారు.

3. ఇంకా కొందరు దిగజారి వ్యక్తిగతంగా, కుటుంబాలపై, పసిపిల్లలపై కూడా నీచంగా విమర్శలు చేస్తున్నారు. మతం, కులం,పార్టీల పేరుతో అవతలి వర్గం వారిని నరికేస్తాం అని హెచ్చరికలు చేస్తే అలాంటివి దుర్మార్గం అని తెలుసుకోవాలి. వాటికి లైకులు కూడా తప్పే.

4. మున్ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆధారాలతో, శాస్త్రీయంగా వ్రాసేవారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే సునిశిత విమర్శలు, వ్యంగ్యం, హాస్యకోణం కూడా ఉండాలి. అంతవరకూ మిగిలినవారు sportive గా తీసుకోవాలి. ఒక స్థాయి వరకూ ఫర్వాలేదు. ఏ స్థాయనేదానిపై విమర్శ చేసే వారికి స్వీయ నియంత్రణ కావాలి.

- చలసాని శ్రీనివాస్

1. సోషల్ మీడియాపై అసహనం..

పొల్టికల్ పంచ్ ఫేస్ బుక్ పేజీలో రాజకీయ కార్టూన్లు వేసిన ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాపై లోకేష్ అసహ‌నం వ్యక్తం చేసిన రెండు రోజులకే అరెస్టులు ప్రారంభమయ్యాయి. పాలకులు విమర్షలను సహించలేక పోవడం వాళ్ళ నియంతృత్వాన్ని తెలియజేస్తోంది. రవికిరణ్ రాజకీయ అభిప్రాయాలు ఏవైనా కానీ, వాటిని మనం ఆమోదించినా ఆమోదించక పోయినా ఆయన అరెస్టును మాత్రం తప్పకుండా ఖండించాలి. చేతిలో అధికారం ఉంది కదా అని ప్రజల కనీస స్వాతంత్య్రాన్ని కూడా కబళించే కుట్ర ఇది. దీనిపై నిరసన తెలపక పోతే అది మన దాకా కూడా వస్తుందనేది మర్చిపోవద్దు.

-షేక్ సాదిక్ అలీ

వాక్స్వాతంత్ర్యానికి భంగం

రవికిరణ్ అరెస్టు వాక్ స్వాతంత్ర్య హక్కు కు భంగం . నిజానికి ఈ అంశాన్ని కోర్ట్ ఇంత కు ముందు ధ్రువీకరించింది కూడా. అతని వ్యాఖ్యలో ( కార్టూన్) అభ్యంతరాలుంటే చర్చించాలి. కానీ అసలు వ్యాఖ్యానించడమే నేరం అనే దౌర్జన్యం చేస్తున్న వారికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే...

- ప్రసేన్ బెల్లంకొండ

జర్నలిస్టు అరెస్టుగానే...

దీన్ని సోషల్ మీడియా "జర్నలిస్టు అరెస్ట్" గానే పరిగణించాలి.అందరం తీవ్రంగా ఖండిద్దాం..విడుదల చేసేవరకు ఉద్యమిద్దాం..

కపిలవాయి రవీందర్

పోలీసు రాజ్యంలో ప్రజాస్వామ్యం బతకదు. నియంతల ఏలుబడికి నూరేళ్ళు నిండినట్టే....?

- శివరామకృష్ణ వల్లూరు

అరెస్టును ఖండించండి...

సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ అరెస్ట్ ను ఖండించండి. రవికిరణ్ అభిప్రాయాలతో ఏకీ భవించాలని లేదు.. అతని అభిప్రాయాలు సక్రమం కాక పోతే చర్చ పెట్టండి.. ఖండించండి.. మీ వాదనను బలంగా వినిపించండి.. అంతే తప్ప వాక్ స్వాతంత్రాన్ని హరించేలా జరిగిన అరెస్ట్ ను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది.

-ఉత్తమ్ కుమార్

పెద్దల సభ కార్టూన్ వల్లనే అతన్ని అరెస్టు చేశారు. వారికి వైసిపి వేతనాలు చెల్లిస్తోందని తర్వాత విచారణలో తేలింది. అందువల్ల ఇది జర్నలిజం కిందికి గానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిందికి గానీ రాదు. పెయిడ్ ప్రొపగండాను యాక్టివిజంగా పరిగణించలేం

- మోహన్ రావిపాటి

పరిమితులుంటాయి...

ప్రతి స్వాతంత్య్రానికి కొన్ని పరిమితులుంటాయి...సోషల్ మీడియా అంటే రెండు వైపులా పదునైన ఆయుధం...తగిన అవగాహన లేకుండా వాడితే క్షతగాత్రులుగా మిగులుతారు...అది రవికిరణ్...ఎబిఎన్ ఆంధ్రజ్యోతి...టీవీ నైన్ అయినా మూల్యం చెల్లించుకోకతప్పదు.

-లసతీష్ కమాల్

విస్తుపోయే విషయాలు...

పోలీసులు రవి కిరణ్ ఇంటూరి ని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. సాక్షికి అనుబంధంగా వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌ ఉందని, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టడమే వీరి పనని తేలింది. ఈ టీమ్‌కు జగన్ మీడియా హౌస్ సాక్షి నుంచే జీతాలు చెల్లిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంపై ఈడీకి ఫిర్యాదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా... మీడియాకు అనుబంధంగా సోషల్‌ మీడియా టీమ్స్‌ పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

- రెడ్డి నాయుడుబాబు

అదే పనిగా చేస్తున్నాయి...

అదే పని అన్ని పార్టీ లు చేస్తున్నాయి.పెయిడ్ వర్కర్లకు పార్టీ కార్యకర్తలకు తేడా లేకుండా పోయింది.అయినా ఇలాంటివి శులభంగా పసిగట్టచ్చు.వ్యక్తుల కోసం రాసేవి అన్నీ కూలి బాపతుల కిందే లెక్క.జనం సమస్యలు సమాజ సమస్యలు వ్యవస్తలోని లోపాలు విదానాల మీద రాసేవి అన్నీ సమాజ కోణంలో రాసేవి.అలాంటి వాటికి ఎవరూ డబ్బులు ఇవ్వరు.

పాశం జగన్నాథనాయుడు

రవికిరణ్‌కు మద్దతు తెలపండి...

అందరూ రవికిరణ్ కి మద్దతు తెలపండి .మన పార్టి కోసం కష్టపడే ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా చూస్తూ ఉరుకోకండి ..ఈరొజు రవికిరణ్ రెపు ఇంకొకరు ....ఇప్పుడు సపొర్ట్ చెయకుంటే రెపు ఇంకొ కార్యకర్త ధైర్యం కోల్పోతాడు ....
#Lets support Ravi

- లక్ష్మి గజ్జల

Lakshminarayana Duddukuri పరిధి దాటితే ఇలానే ఉంటుంది. లైఫ్ స్పాయిల్ తప్పితే.., ఇంకేమీ ఉండదు.. పాపం.., ఓ రాజకీయపావుగా పార్టీలకు ఉపయోగపడటం తప్ప ఇంక మిగిలేది ఏమీ లేదు.

క్రొకడైల్ ఫెస్టివల్...

సోషల్ మీడియా వేదికగా ఎవరి అభిప్రాయాలు వారివి.. ఆయా వ్యక్తుల మనోభావాలకు అనుగుణంగా పోస్టులు.. వాటిని అభినందించే వారు కొందరైతే... విభేధించే వారు మరికొందరు. ఇక రాజకీయ పార్టీలకు అయితే చెప్పే పనిలేదు.. తమ నాయకులను పొగుడుతూ.. ప్రత్యర్థులపై బురద జల్లటం.. కొందరి పోస్టులు ఒక్కో సారి శృతి మించొచ్చు.. మరికొందరు ఏకంగా రచ్చ చేయొచ్చు.. అయితే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రాన్ని అంతా గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో రెగ్యులర్ మీడియా.. పత్రికలు, ఛానెళ్లకు ఎక్కడా ప్రత్యేక హక్కులు లేవు. ఆ మీడియాకు ఎలాంటి స్వాతంత్రం ఉందో... సోషల్ మీడియాకు అంతే.. ఇది ఏ ఒక్కరి చేతిలోనే నడిచే గుత్తాధిపత్య సంస్థ కాదు.. ఇక్కడ ఎవరికి వారే.. రిపోర్టర్లు.. యాజమాన్యాలు.. అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా రెగ్యులర్ మీడియా అధికార పార్టీల చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మింగుడుపడనిది.. సోషల్ మీడియానే.. ఇక దీన్ని అదుపులో పెట్టాలన్న ఆలోచన. దీన్నుంచే అరెస్టులు... ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేసి సోషల్ మీడియాను అదుపులో పెట్టామను కొంటే... అది భ్రమే... ఇప్పుడేమైంది... ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్...

- ఉత్తమ్ కుమార్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Opinions are pouring in Facebook on the arrest of political punch cartoonist Ravi Kiran's arrest
Please Wait while comments are loading...