పురుగుల మందు డబ్బాతో ఒకామె: తాగి మరొకామె

అనంతపురం జిల్లాలోని కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి ఎదురైంది. కార్పోరేటర్‌గా నామినేషన్ దాఖలు చేసిన రమాదేవి అనే మహిళ తనకు పార్టీ బీఫామ్ ఇవ్వలేదంటూ పురుగుల మందు డబ్బా పట్టుకుని నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్లు ఇచ్చేది తాము కాదని నేతలు చెబుతున్నా రమాదేవి వినిపించుకోకపోవడంతో ఏం చేయాలో తోచని స్ధితిలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే, ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలు బయటపడ్డాయి. 14వ వార్డు కౌన్సెలర్‌గా పోటీచేసేందుకు బీఫామ్ ఇవ్వలేదనే మనస్తాపంతో పట్టణకాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీదేవి విలేకర్ల సమక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఆమెను వెంటనే తోటి కార్యకర్తలు సింగరేణికాలనీ ఆస్పత్రికి తరలించారు. తాము రేణుకాచౌదరి వర్గం కావడం వల్లే కొందరు తమకు టిక్కెటు రాకుండా అడ్డుకున్నారని శ్రీదేవి సన్నిహితులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications