కేటీఆర్-జగన్ స్నేహితులు, కేసీఆర్ బెడ్రూం నుండి రాకుండానే: రావుల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మిత్రపక్షంగా ఉన్నాయని మహానాడు వేదికగా రావుల చంద్రశేఖర రెడ్డి శుక్రవారం నాడు మండిపడ్డారు.
నిన్న మంత్రి కేటీఆర్.. జగన్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరారని గుర్తు చేశారు. వారి తీరు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేటీఆర్ - జగన్ తెలంగాణలో స్నేహితులు అన్నారు. వారు మిత్రపక్షం అన్నారు. టీడీపీని లక్ష్యంగా చేసుకొని వారిద్దరు ఒక్కటయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కేటీఆర్ జగన్‌కు గురువారం నాడు ఫోన్ చేశారు. వారు ఫోన్ చేసుకోవడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెరాసకు జగన్ ఎలా మద్దతిస్తారని ప్రశ్నిస్తున్నారు.

మహానాడులో రావుల మాట్లాడుతూ.. తెలంగాణలో జగన్, తెరాస మిత్రపక్షాలన్నారు. పదహారు నెలల పాటు జైలులో ఉన్న వ్యక్తిని ఊరేగింపుగా తీసుకు వెళ్లారని, జగన్ రాజకీయాలను దిగజార్చారన్నారు. టీడీపీ ఆంధ్రా పార్టీ కాదని, తెలుగు తెలుగువాళ్ల పార్టీ అని, ఇది అందరి పార్టీ అన్నారు. టీడీపీ మహానాడు కోసం దేశ విదేశాల నుండి ఎందరో వచ్చారన్నారు.
కవితకు కౌంటర్
మహానాడు రికార్డింగ్ డ్యాన్సులను తలపిస్తోందన్న ఎంపీ కల్వకుంట్ల కవితకు రావుల చంద్రశేఖర రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం ఏం చేయకుండా ఏదేదో మాట్లాడుతోందన్నారు. వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు.
ఏపీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు బాగా పని చేస్తున్నారని, ఇక్కడ కేసీఆర్ మాత్రం చేయడం లేదన్నారు. కేసీఆర్ బెడ్రూం నుండి బయటకు రాకుండా పేదలకు బెడ్రూంలు అంటూ ఊరిస్తున్నారని ధ్వజమెత్తారు. సాగర్ ను ఖాళీ చేస్తామని, సచివాలయం మారుస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. ఓయు భూమిని తీసుకుంటామని కేసీఆర్ చెప్పడం దిక్కుమాలిన ఆలోచన అన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications