రాయల తెలంగాణ: అధిష్టానానికి వదిలేసిన దామోదర
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో రాయల తెలంగాణ ఓ ఆప్షన్ అని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఆయన శనివారం జివోం సభ్యులు జైరాం రమేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు పది జిల్లాల తెలంగాణ కావాలన్నారు. తాము దానికే మొగ్గు చూపుతున్నామన్నారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

బిల్లు ఏ రకంగా వస్తుందో, అందులో ఏ అంశాలు పొందుపరుస్తున్నారో, తెలంగాణ ఉందో, రాయల తెలంగాణ ఉందో, భద్రాచలాన్ని ఏం చేస్తున్నారో అన్న దాని పైన చర్చించామన్నారు. పోలవరం, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ గురించి మాట్లాడినట్లు చెప్పారు. శీతాకాల సమావేశాల్లోనే విభజన బిల్లు వస్తుందన్నారు.
తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్యాకేజీ, భద్రాచాలం, పోలవరం ముంపుపై చర్చించినట్టు ఆయన చెప్పారు.
రాయల తెలంగాణ కూడా ఓ ఆప్షన్ అన్నారు. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాయల తెలంగాణ అంశం ఢిల్లీలో గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో దామోదర జీవోఎం సభ్యులు జైరాం రమేష్‌తో పాటు ఎకె ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications