నీటి దోపిడీకే: హరీష్, కెసిఆర్ ఫాంహోస్‌లో: మోత్కుపల్లి

Mothkupalli-Harish
మహబూబ్‌నగర్/ హైదరాబాద్/ న్యూఢిల్లీ: జల వనరుల దోపిడీకే రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు విమర్శించారు. రాయల తెలంగాణకు అంగీకరించేది లేదని ఆయన సోమవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు.

కాగా, చిత్తూరు జిల్లాకు నిధుల విడుదలపై ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు చిత్తూరుకు కేటాయించిన నిధులకు శానససభ ఆమోదం గానీ మంత్రి మండలి ఆమోదం గానీ లేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో లేవనెత్తాలని ఆయన తెలంగాణ మంత్రులకు సూచించారు. దీనిపై ఆయన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను తెలంగాణ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు పంపిస్తామని ఆయన చెప్పారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. రాయల తెలంగాణపై రగడ జరుగుతుంటే కెసిఆర్ ఫాం‌హౌస్‌లో పడుకున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మధ్య జరిగిన ఒప్పందం మేరకే రాయల తెలంగాణ ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. టిఆర్ఎస్‌ను ఆర్టిఆర్ఎస్‌గా మారుస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడక ముందే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు యాత్రలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు

రాయల తెలంగాణను అంగీకరించేది లేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జెఎసి ప్రతినిధులు సోమవారం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని కలుసుకున్నారు. రాయల తెలంగాణ ఏర్పడితే బాధ్యత కాంగ్రెసు నాయకులదేనని ఆయన అన్నారు. జాతీయ పార్టీల నాయకులను కలిసి పది జిల్లాలతో కూడిన తెలంగాణకే మద్దతు ఇవ్వాలని కోరుతామని కోదండరామ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+