వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు ఆర్ఎస్ఎస్ వార్నింగ్: సీమలో తిరగనివ్వం.. కోస్తాంధ్రలో పోటీ చేసుకో!

'రాయలసీమలో పోటీ అంటున్నావ్.. అసలిక్కడ నీకేం పని.. వెళ్లి కోస్తాంధ్రలో పోటీ చేసుకో.. నిన్ను రాయలసీమలో అడుగుపెట్టినచ్చేది లేదు' అని వెంకటసుబ్బారెడ్డి తేల్చి చెప్పారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి బరిలో దిగుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు అప్పుడే వ్యతిరేక పవనాలు వీచడం మొదలయ్యాయి. స్వార్థ రాజకీయాల కోసం, కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే పవన్ రాజకీయాలు మాట్లాడుతున్నారని రాయలసీమ రాష్ట్ర సమితి(ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

<strong>వారికి టిక్కెట్లు ఇస్తారా?: పవన్ కళ్యాణ్‌కు మరకే అవుతుంది</strong>వారికి టిక్కెట్లు ఇస్తారా?: పవన్ కళ్యాణ్‌కు మరకే అవుతుంది

పవన్ కళ్యాణ్‌ను రాయలసీమలో తిరగనవివ్వమని హెచ్చరించారు. 'రాయలసీమలో పోటీ అంటున్నావ్.. అసలిక్కడ నీకేం పని.. వెళ్లి కోస్తాంధ్రలో పోటీ చేసుకో.. నిన్ను రాయలసీమలో అడుగుపెట్టినచ్చేది లేదు' అని వెంకటసుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. గతంలో చిరంజీవి చేసిన రాజకీయాలను ఎద్దేవా చేస్తూ.. మీ అన్న లాగే పార్టీని అమ్ముకోవడానికే రాయలసీమ నుంచి పోటీ చేస్తా అంటున్నావా? అని ప్రశ్నించారు.

rayalaseema rashtra samiti warning to pawan kalyan

రాష్ట్రం విడిపోయాక విజయవాడకు దక్కుతున్న ప్రాధాన్యత రాయలసీమకు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విజయవాడలోనే ఏర్పాటు చేస్తే రాయలసీమ గతేంటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి 11జిల్లాలతో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

శుక్రవారం నాడు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల పట్ల స్పందిస్తారో లేదో చూడాలి.

English summary
Rayalaseema Rashtra Samiti president Venkata Subbareddy strongly warned Janasena Pawan Kalyan regarding his politics in Rayalaseema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X