ఎమ్మెల్యేలొస్తే: జగన్‌పై రాయపాటి ఫైర్, పదవిపై కెటిఆర్

తన కేసుల మాఫీ గురించే వైయస్ జగన్ కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే.. దానిని తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉదయం రాయపాటి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
మంత్రి పదవిపై ఆసక్తి లేదు: కెటిఆర్
మంత్రి పదవిపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని, కెసిఆర్ తనకు ఏవైనా బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడారు.
అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని దీనిని ఒక బాధ్యతగా స్వీకరించి తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడానికి కేంద్రంతో సంబంధాలను కొనసాగిస్తామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ప్రత్యర్థులను సైతం కలుపుకుని అభివృద్ధి కోసం రాజనీతితో పని చేస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications