13న వైసీపీలోకి డొక్కా: ఎంపీ రాయపాటి ఆసక్తికర వ్యాఖ్య
అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్క మాణిక్య వర ప్రసాద్ పార్టీ మారనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. రాయపాటిని రాజకీయ గురువుగా భావించే డొక్కా తన గురువు టీడీపీలోకి వెళ్లినా, ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.
అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న డొక్కా మాణిక్య వర ప్రసాద్, ఈనెల 13వ తేదీన వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో 2004లో తాడికొండ నుంచి పోటీ చేసిన ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో కూడా విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు.
దీనిపై డొక్కా అధికారికంగా ప్రకటించకున్నా, తన శిష్యుడిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు రాయపాటి సాంబశివరావు రంగంలోకి దిగాడు. 'డొక్కా మాకు సోదరుడు లాంటివారు. ఆయన మాతోనే ఉంటారు. టీడీపీలో చేరతాడు' అంటూ రాయపాటి వ్యాఖ్యానించారు.
ఈరోజు సమయం కుదిరితే డొక్కాను చంద్రబాబు వద్దకు తీసుకువెళతానని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications