రుణాల రీషెడ్యూల్ ఏపిలో 4జిల్లాలకే పరిమితం: ఆర్‌బిఐ

సహకార, గ్రామీణ, వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన రుణాలకే ఈ వెసులుబాటు కల్పిస్తునట్లు స్పష్టం చేసింది. బంగారం తాకట్టు, అనుబంధ రంగాలపై రుణ రీషెడ్యూల్ కుదరని రిజర్వు బ్యాంక్ తేల్చి చెప్పింది. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరువు పరిస్థితి ఏమిలేదని.. రుణాలు రీషెడ్యూల్ చేయలేమని ప్రకటించిన విషయం తెలిసిందే.
రుణాల మాఫీ ఘనత మాదే: యనమల
రిజర్వు బ్యాంక్ నుంచి ఇబ్బందులు ఎదురైనా రుణాల మాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
రూ. 45వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications