గులాంగిరీ చెయ్యను .. ఓటమి బాధ నుండి కేవలం 15 నిమిషాల్లో కోలుకున్నానన్న పవన్
తానా 22 వ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఎన్నికల ఓటమి నుంచి కోలుకోవడానికి కేవలం 15 నిమిషాలు పట్టిందని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రజల విశ్వాసం పొందాలంటే , ఆ విశ్వాసం ఓటు బ్యాంకుగా మారాలంటే చాలా సమయం పడుతుందని తనకు తెలుసనీ పవన్ అన్నారు.

గెలిస్తే పొంగిపోయి ఓడిపోతే కుంగిపోయే వ్యక్తిని కాదన్న పవన్ కళ్యాణ్
ఎన్నికల ప్రచారంలో తన సమావేశాలకు హాజరైన జనాన్ని చూస్తూ విజయం సాధిస్తామని పార్టీకి చెందిన చాలా మంది నాయకులు భావించారు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ జనసేనకు ఓటు వేయరని నాకు తెలుసు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తాను నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేశాను కాబట్టి ఓడిపోయాను అని ఆయన తెలిపారు . ఇక ఓటమితో తాను అస్సలు నిరాశ చెందలేదని, మరికొంత కాలం తాను ఓపికగా వేచి ఉండగలనని పవన్ కళ్యాణ్ అన్నారు.‘గెలిస్తే పొంగిపోయి ఓడిపోతే కుంగిపోయే వ్యక్తిని కాదని తన స్వభావం అలాంటిది కాదని ఆయన అన్నారు

నేను గులాంగిరీ చేసి బతకలేనన్న పవన్ .. ఆత్మగౌరవంతో సాగుతానని ధీమా
నా మొదటి సినిమా విజయం సాధించినప్పుడు భవిష్యత్‌లో ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని పొందుతానని ఎవరైనా ఊహించారా..? ఊహించలేదు కదా ఇప్పుడు జనసేన కూడా అంతే అని ఆయన తన అభిప్రాయం వెల్లడించారు. అమెరికాలోని వర్జీనియాలో ప్రవాసాంధ్రులైన జనసేన అభిమానులు నిర్వహించిన సమావేశాల్లో ప్రసంగించినా ఆయన చేసిన వ్యాఖ్యలు అటు ప్రవాసాంద్రులనే కాక తెలుగు వారిని సైతం ఆకట్టుకున్నాయి. . ‘ఒక్క అపజయం నన్ను వెనక్కి లాగలేదని పేర్కొన్న పవన్ డబ్బుతో ముడిపడిన రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అని అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది భవిష్యత్‌ను నిర్దేశించాలంటే అనుభవం కావాలన్న పవన్ నేను గులాంగిరీ చేసి బతకలేను. ఆత్మగౌరవంతో వెళ్తాను అని పేర్కొన్నారు.

స్వార్ధపరుడిని అయితే వారితో కలిసే వాడిని అన్న పవన్
నాకు నెల్సన్ మండేలా వంటి పోరాటాలు లేవన్న ఆయన పరాజయాలనే వ్యర్దాల్ని తొలగించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఓటమిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు అన్న పవన్ ఆ ఆత్మగౌరవం అని ఆయుధంతో ముందుకు వెళ్తానని చెప్పారు. అది లభించని చోట వజ్రాలు ఇచ్చినా ఉండనని పేర్కొన్నారు. నా స్వార్ధం నేను చూసుకునే వాడినే అయితే బీజేపీ, టీడీపీతో గొడవపెట్టుకోను. గెలిచే సీట్లు తీసుకుని వారితో కలిసేవాడినని పేర్కొన్నారు పవన్ . నేను ఓడిపోయినా అదేదో పెద్ద అవమానంగా భావించలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీలు వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పిన పవన్ అలాంటి రాజకీయ పద్మవ్యూహంలోకి వెళ్లిన జనసేన క్షేమంగా బయటకు వచ్చిందని చెప్పుకున్నారు .












Click it and Unblock the Notifications