తిరుమల శేషాచలం అడవుల్లో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు ..టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడి
తిరుమల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఒక పక్క దేశం కరోనాతో కల్లలోలంగా మారుతున్నా స్మగ్లర్లు మాత్రం తమ దందా ఆపటం లేదు. తమ పంధా వీడటం లేదు . ఎర్రచందనం దుంగలను తరలిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై స్మగ్లరు రాళ్ళతో దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో జరిగింది.
శేషాచల అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ బృందం కూంబింగ్ చేస్తున్న క్రమంలో చంద్రగిరి మండలం భీమవరం ఘాట్ రోడ్ లో దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీసులకు స్మగ్లర్లు తారసపడ్డారు. తమిళనాడుకు సంబంధించిన ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూడడంతోనే వాళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. స్మగ్లర్ల దాడితో ఉలిక్కిపడినా వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారితో తీవ్రంగా ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీగా దాడి కొనసాగిన తరువాత స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలేసి పారిపోయారు.

పోలీసుల నుంచి తప్పించుకున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రస్తుతం శేషాచల అడవిని జల్లెడ పడుతున్నారు. మొత్తం 35 మంది తమిళ స్మగ్లర్లు పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు.పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలంలో 33 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు స్మగ్లర్లు వినియోగించిన టార్చ్ లైట్ లను,వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలను,అక్కడ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications