తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్ర చందనం స్మగ్లింగ్ లో మైనర్లు కూడా .. నెలరోజుల్లో రెండో ఘటన, తిరుపతిలో 21 మంది తమిళ స్మగ్లర్ల అరెస్ట్ !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరు అధికారులకు విస్మయాన్ని కలిగిస్తోంది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం అడవిలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ఇరవై ఒక్క మంది తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వీరిలో మైనర్ బాలురు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

YSR Death Anniversary: వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్, వైయస్ షర్మిల(ఫోటోలు)YSR Death Anniversary: వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్, వైయస్ షర్మిల(ఫోటోలు)

చిత్తూరు జిల్లాలో 21 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు

చిత్తూరు జిల్లాలో 21 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు

చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను అడవిలోకి వెళుతున్న క్రమంలో అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గొడ్డళ్ళు తీసుకొని అడవిలోకి వెళుతున్న 21 మంది తమిళ స్మగ్లర్లుగా గుర్తించారు. మొత్తం 21 మందిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు వారి వద్ద నుండి పది గొడ్డళ్లు, 12 సెల్ ఫోన్లు, 10,910 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐదుగురు మైనర్ లుగా గుర్తించి వారిని జువైనల్ హోంకు తరలించారు. మిగతా 16 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందర్ రావు పేర్కొన్నారు.

నెలరోజుల్లో రెండో ఘటన , ఇటీవల చిత్తూరు జిల్లాలో తమిళ స్మగ్లర్లు అరెస్ట్ .. వారిలోనూ మైనర్లు

నెలరోజుల్లో రెండో ఘటన , ఇటీవల చిత్తూరు జిల్లాలో తమిళ స్మగ్లర్లు అరెస్ట్ .. వారిలోనూ మైనర్లు

గత నెలలో చిత్తూరు జిల్లా భాకరాపేట అడవుల్లో ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో, ఈత గుంట ప్రాంతంలో ఆరుగురు ఎర్రచందనం దుంగలను మూసుకొని వెడుతూ కనిపించడంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్న వారిలో తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లాకు చెందిన తమిళ స్మగ్లర్లు ఉన్నారు. అప్పుడు అరెస్ట్ చేసిన వారిలోనూ ఇద్దరు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించారు. మిగతా వారిపై కేసు నమోదు చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసే పనిలో పడ్డారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

 శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దందా

శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దందా

శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా రోజు రోజుకూ రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎర్రచందనం దుంగలను కొట్టి స్మగ్లర్లు ఇతర రాష్ట్రాలకే కాదు, విదేశాలకు సైతం తరలిస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలకు చెక్ పెట్టడానికి ఎంత పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ స్మగ్లర్ల దందాలు సాగుతూనే ఉన్నాయి. స్మగ్లర్లు, అంతర్రాష్ట్ర దొంగలు మాత్రమే కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పేరు మోసిన క్రిమినల్స్, రౌడీషీటర్ల ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉంటున్నట్లుగా తెలుస్తుంది.

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్మగ్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్మగ్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు


రాయలసీమ వ్యాప్తంగా కూడా నిదానంగా చాప క్రింద నీరులా ఎర్ర చందనం స్మగ్లర్ల ముఠా విస్తరిస్తోంది. ఈ పరిణామాలు పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర పర్యాటక శాఖామంత్రి, మాజీ హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన సమయంలో కూడా ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చెయ్యటం కూడా తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎంతగా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు ఎర్రచందనం స్మగ్లింగ్ కుపాల్పడుతున్నారని అంతర్జాతీయ మాఫియాను అంతమొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

English summary
The task force police arrested the red sandalwood smugglers on their way to the forest at Anjeramma Kanuma in Vadamalpeta mandal of Chittoor district. 21 Tamil smugglers were identified who were going into the forest with axes. The task force officers arrested a total of 21 people and seized ten axes, 12 cell phones and Rs 10,910 cash from them. Five of those captured were identified as minors and taken to a juvenile home. Task force SP Sundar Rao said the case against the other 16 was being registered and investigated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X