ఎర్రచందనం స్మగ్లింగ్: లారీ డ్రైవర్ కోట్లకు పడగలెత్తాడు
కడప: గత ఇరవై ఏళ్లుగా ఎర్రచందనా న్ని స్మగ్లింగ్ చేస్తూ వందల కోట్లకు పడగలెత్తిన ఓ లారీ డ్రైవర్‌ను కడప పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఇప్పటికే 500 టన్నులు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించిన డ్రైవర్ తిమ్మసముద్రం వెంకటరెడ్డి ఆస్తులు రూ.200 కోట్ల వరకు ఉంటాయని భావిస్తున్నారు.
అతడితో పాటు తమిళనాడుకు చెందిన మహమ్మద్ అలీ, కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన జంగాల వీరభద్రయ్య, చిట్వేలికి చెందిన కందుల రాజమోహన్‌రెడ్డి, వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు చెంగల్‌రెడ్డిని కూడా సోమవారం అరెస్టు చేశారు. వీరంతా కూడా కోట్లకు పడగలెత్తి న స్మగ్లర్లే.

నాలుగు రాష్ట్రాలకు ఎర్రచందనాన్ని రవాణా చేస్తూ కార్యకలాపాలను విస్తరించారు. కడప ఎస్పీ నవీన్‌గులాఠీ వీరిని అరెస్టు చేసిన అనంతరం మీడియాకు ఆ వివరాలను అందించారు. కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట బ్రిడ్జి సమీపంలో యాంటీ స్మగ్లింగ్ ప్రత్యేక దళం వీరిని అరెస్టు చేసింది.
వారి నుంచి 2.2 టన్నుల 171 దుం గలు స్వాధీనం చేసుకుని తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగరం గోడౌన్‌లో నిల్వ వుంచిన 14 కిలోల ఎర్రచందనం పూసలు, మూడు కార్లు, ట్యాంకరు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని గోడౌన్‌ను సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications