తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బట్టలిప్పి కొట్టి, చంపారు: ఎర్రచందన దొంగల పాశవికదాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Red Wood smugglers kills two officers
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం దొంగలు అటవీశాఖ అధికారులపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు మృతి చెందగా, మరో ఇద్దరు అదృశ్యమయ్యారు. కొంతమందికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పలువురు అధికారులు ఎర్ర చందనం దొంగలను పట్టుకునేందుకు అడవుల్లోకి వెళ్లారు. వీరిపై దాదాపు వందమంది దొంగలు దాడికి పాల్పడ్డారు.

ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శేషాచలం కొండల్లోని పార్వేటి మండలంకు అధికారులు వెళ్లారు. వీరిపై ఎర్ర చందనం స్మగ్లర్లు పుల్లట్ల వద్ద రాళ్లతో దాడికి పాల్పడ్డారు. స్మగ్లర్ల దాడిలో అటవీ శాఖ అధికారులు ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఓ ఫారెస్ట్ అధికారిని స్మగ్లర్లు బట్టలు ఊడదీసి కొట్టి మరీ చంపారు. డేవిడ్ కరుణాకర్ అనే అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు.

మరో ఇద్దరు అధికారుల జాడ తెలియరాలేదు. దీంతో స్మగ్లర్లు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. దొంగల దాడిలో గాయపడిన వారిని తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో నాలుగు అటవీశాఖ జీపులు కూడా ధ్వంసమయ్యాయి. దాడి సమాచారం తెలియగానే ఉన్నతాధికారులు అదనపు బలగాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు.

కిరణ్ దిగ్భ్రాంతి

అటవీ శాఖ అధికారులపై దొంగల దాడిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. మంత్రి శత్రుచర్ల విజయరామారావు కూడా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

English summary

 Red Wood smugglers killed two forest offiecrs at Pullatla area near Parveti mandal in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X