డీఈవో రాసలీలలు, సెల్‌ఫోన్లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్!: విచారణ
కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ విద్యాధికారి రాసలీలల అంశం చర్చనీయాంశమైంది. డీఈవో పైన రాసలీలల ఆరోపణలు రావడంతో రీజినల్ జాయింట్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణ జరపాలని మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా డీఈవో సుప్రకాష్ రాసలీలలు ప్రసారమాధ్యమాల్లో ప్రసారం అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది చర్చనీయాంశంగా మారింది. మహిళలతో మాట్లాడిన శృంగార సంభాషణలతో కూడిన ఆడియో, వీడియో దృశ్యాల క్లిప్పింగ్‌లు వాట్సాప్, మొబైల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో డిఈఓ వ్యవహారం పైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అతను ప్రకాశం జిల్లా నుంచి కర్నూలుకు గత ఏడాది బదిలీ పైన వచ్చారు. ఆయనతో సన్నిహితంగా మెలిగే ఒకరు ఈ వ్యవహారానికి తెర లేపినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న ఇంట్లో రాత్రిపూట మద్యం తాగి మహిళలతో గడిపేవారని ఆరోపణలు వస్తున్నాయి.
మహిళలతో విద్యాధికారి ఉన్న దృశ్యాలు, మాటలను ఒకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. గత నాలుగైదు రోజులుగా ఈ మాటల ఆడియో, వీడియో దృశ్యాలు జిల్లావ్యాప్తంగా వెలుగుచూశాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.












Click it and Unblock the Notifications