Farmers: రైతులకు ఏపీ సర్కార్ మరో బిగ్ న్యూస్..! అసెంబ్లీలో కీలక ప్రకటన..!
ఏపీలో రైతులకు (farmers)ప్రభుత్వం ఇవాళ మరో శుభవార్త చెప్పింది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓ కీలక అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి రైతుల కోసం ఈ నిర్ణయం అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యే నాటికి రైతులకు భారీ ఊరట లభించినట్లేనని భావిస్తున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల (agriculture power connections)పై జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 22,30,703 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు డిస్కంల పరిధిలో 1,02,538 కనెక్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. అలాగే పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపైనా మంత్రి క్లారిటీ ఇచ్చేశారు.

వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్ లో ఉన్న 46 వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఉచిత వ్యవసాయ కనెక్షన్లు కోసం 839.44 కోట్లు ఖర్చు చేశాయని,
పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి 1,059 కోట్లు ఆదా అవుతుందన్నారు. అలాగే ఏప్రిల్ నుంచి చేనేతలకు 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని కూడా ప్రకటించారు.












Click it and Unblock the Notifications