Pawan Kalyan: ఎన్నికల వేళ రేణు దేశాయ్ పోస్ట్.. ఎవరి కోసమంటే..!

జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మోడల్, డిజైనర్, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత పవన్, రేణు విడాకులు తీసుకుని విడిపోయారు. పిల్లలిద్దరు రేణు దేశాయి వద్దే ఉంటున్నారు.

కొంత కాలం అన్నింటికి దూరంగా ఉంటూ వచ్చిన రేణు దేశాయి ఆ తర్వాత టీవీ షోల్లో పాల్గొంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో మాజీ భర్త పవన్ కల్యాణ్ పై కూడా రేణు దేశాయి మాట్లాడుతూ ఉంటారు. తాజాగా రేణ్ దేశాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దేశాయ్ తన చేతికి ఉన్న పచ్చబొట్టును ఫొటో తీశారు.

Renu Desai posted an interesting post during AP elections

ఆ ఫొ టోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. "కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది(నా పచ్చబొట్టు మౌనం పరమ శీలం అని చెబుతుంది 🪷)" అని రాసుకొచ్చారు. ఆమె ఈ పోస్ట్ తోపాటు ఎలక్షన్స్ 2024 హ్యాష్ ట్యాగ్ పెట్టారు. దీంతో ఇది రాజకీయ పోస్ట్ గా మారింది. పవన్ కల్యాణ్ సపోర్ట్ గానే పోస్ట్ చేసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా పచ్చబొట్టులో పవన్ అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ జనసేన టీడీపీ, బీజేపీతో కలిసి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ ప్రచారం కూడా ముమ్మరం చేశారు. తాజాగా పవన్ కల్యాణ్ పై రాళ్ల దాడి జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+