మీకు తెలియదనుకొని లేఖ రాస్తున్నా!: మోడీకి కేసీఆర్
హైదరాబాద్: గవర్నర్‌కు హైదరాబాద్‌పై అధికారాలు ఇస్తూ కేంద్రం ఆదేశాలు పంపించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా ఒక లేఖ రాశారట. గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టడాన్ని ఆక్షేపిస్తూ కేంద్రం నుంచి వచ్చిన ఈ ఆదేశం గురించి మీకు తెలియదని భావిస్తున్నానని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
అందుకే ఇప్పుడు ఈ లేఖ రాస్తున్నానని కేసీఆర్ అందులో పేర్కొన్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్‌కు హైదరాబాద్‌పై అధికారాలు అప్పగిస్తున్న ఆదేశాన్ని నిరసిస్తూ తెలంగాణ సిఎస్ రాసిన లేఖను కూడా కేసీఆర్ తమ లేఖకు జతపరిచారు.
కేసీఆర్ సీరియస్

హైదరాబాద్‌పై అధికారాలను, బాధ్యతలనూ గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ అంశంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఆయన టిఆర్ఎస్ ఎంపీలకు చెప్పారు.
ఈ అంశంపై పార్లమెంటును స్తంభింప చేయాలని కేసీఆర్ వారికి సూచించారు. అలాగే అవసరమైతే కేంద్రం తీరు పైన న్యాయపోరాటానికి సిద్ధమని కేసీఆర్ చెప్పారు. ఇటు పార్లమెంటులో నిలదీయడంతో పాటు జాతీయస్థాయికి దీనిని తీసుకు వెళ్లడం, మరోవైపు అవసరమైతే కోర్టుకు వెళ్లడం అనే ద్విముఖ పోరుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications