వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపులు వెనకబడి ఉన్నారా?: వీరి మాటేమిటని ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ హోరెత్తుతున్న నేపథ్యంలో కాపుల సామాజిక పరిస్థితి ఏమిటనే దాని కన్నా వివిధ రంగాల్లో కాపులు ఏ విధంగా ఆధిపత్యంలో ఉన్నారో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాపులు ఏమంత వెనకబడి లేరని చెప్పడానికి ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. బుధవారం విజయవాడలో సమావేశమైన 25 బీసీ సంఘాల

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం ఈ నెల 5వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్న నేపథ్యంలో ఆ విషయంపై విస్తృతమైన చర్చ సాగుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో కాపుల ఆధిపత్యం ఉందని అంటున్నారు.

కాపు ఉద్యమాల నేత: ఎవరీ ముద్రగడ?కాపు ఉద్యమాల నేత: ఎవరీ ముద్రగడ?

Report: Kapus presence is every where

సినీ పరిశ్రమలో కాపుల ఆధిపత్యాన్ని చెప్పడానికి చిరంజీవి కుటుం సభ్యులను ఉదహరిస్తున్నారు. చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, వారి కటుంబ సభ్యులంతా ఉన్నారని అంటున్నారు. అదే విధంగా దాసరి నారాయణ రావు వంటి పెద్దలు సినీ పరిశ్రమలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్నారని చెబుతున్నారు.

ఇంతకు ముందు ఎస్వీ రంగారావు, సత్యనారాయణ సినీ రంగంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా దర్శకులుగా పూరీ జగన్నాథ్, వివి వినాయక్ రాణిస్తున్న విషయాన్ని, కోడి రామకృష్ణ వంటివారు సినీ పరిశ్రమలో ఎదిగిన విషయాన్ని చెబుతున్నారు.

Photos: Kapu Protests Turn Violent

రాజకీయ రంగంలోనూ చెప్పుకోదగినంత మంది ఉన్నారని అంటున్నారు, పల్లంరాజు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మంత్రివర్గంలో చినరాజప్ప, గంటా శ్రీనివాస రావు, నారాయణవంటి వారున్నారు. ఇంతకు ముందు హరిరామజోగయ్య వంటివారు మంత్రులుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Report: Kapus presence is every where

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, జ్యోతల నెహ్రూ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గం నుంచి ఎదిగి వచ్చినవారేనని వాదిస్తున్నారు. ప్రస్తుతం శాసనసభలో 32 మంది కాపు శాసనసభ్యులున్న విషయాన్ని ఆంగ్ల పత్రిక కథన గుర్తు చేసింది. ప్రస్తుతం కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అధికార యంత్రాంగంలోనూ కాపులు గణనీయంగానే ఉన్నారని బీసీలు వాదిస్తున్నారు. వారు చెబుతున్న లెక్కల ప్రకారం - న్యాయమూర్తులు (జస్టిస్ స్థాయి) ఎనిమిది మంది ఉన్నారు. ఐఎఎస్‌లు 27 మంది, ఐపిఎస్‌లు 25 మంది, ఐఎఫ్ఎస్‌లు ఏడుగురు ఉన్నారు.

English summary
Debate on Kapus social status is doing rounds in media circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X