ఉర్దూలో కేసీఆర్, అక్బర్ ఆనందం: విద్యుత్‌పై తీర్మానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీరు పైన మజ్లిస్ పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీకి సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ ఉర్దూలో మాట్లాడారు. దీని పైన అక్బర్ తన ఆనందం వ్యక్తం చేశారు. ఒక తరం తర్వాత శాసన సభలో ముఖ్యమంత్రి ఉర్దూ మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు.
తీర్మానం పైన..
విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణ రాష్ట్ర శాసన సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని తెలంగాణ శాసన సభ అంగీకరించింది. అంతకుముందు పలువురు నేతలు మాట్లాడారు.

కేసీఆర్ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ వద్ద 10,500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉందని చెప్పారు. దేవుడి దయ వల్ల వానలు పడితే విద్యుత్ సమస్య పెద్దగా ఉండదన్నారు. ఎన్టీపీసీలో 16వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు స్థలం ఇప్పటికే ఉందని చెప్పారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగో రోజే తమ దిష్టిబొమ్మలు దగ్దం చేశారని ఓ సందర్భంలో కేసీఆర్ అన్నారు.
తీర్మానం పైన రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్మానంలో తమను, చంద్రబాబును ఉద్దేశిస్తే తాము అంగీకరించమని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. దీంతో జానా రెడ్డి కల్పించుకొని మొండి అనే పదాన్ని తొలగించాలన్నారు. జానా విజ్ఞప్తిని కేసీఆర్ మన్నించారు.
జానా సీనియర్ నాయకులని, ఆయన విజ్ఞప్తిని తాము మన్నిస్తామని, మొండి అనే పదాన్ని తీసి వేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సమస్యను తీర్చాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం అందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు వెళ్దామన్నారు.
తీర్మానాలు ఇవే..
పునర్విభజన చట్టం హామీ మేరకు తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆంధ్రప్రదేశ్ లేదా ఏపీకి కేంద్రం ఇచ్చే కరెంట్ కోటా నుండి ఇప్పించాలి. అందరికీ విద్యుచ్ఛక్తి పథకం: 24 గంటలు ఇచ్చే కేంద్ర విద్యుత్ పథకంలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టాలి.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications