రేవంత్ ముడుపుల కేసు: ఎవరీ సెబాస్టియన్ హారీ?

హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను ప్రలోభపెట్టేందుకు తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ముడుపుల వ్వవహారంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు అరెస్టయిన వారిలో సెబాస్టియన్ హారీ కూడా ఉన్నారు. ఇంతకీ ఎవరీ సెబాస్టియన్ హారీ అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ విభాగం నాయకుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.

Revanth bribe case: who is sebhastian haree

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ డీల్‌కు సంబంధించి ముఖ్య భూమిక పోషించారు. ఈ వ్యవహారంలో హారీయే మధ్యవర్తి అని, ఆయనను ప్రశ్నిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చారు. ఏ1గా రేవంత్ రెడ్డి, ఏ2గా సెబాస్టియన్, ఏ3గా ఉదయ్ సిన్హా, ఏ4గా మాథ్యూస్ జెరూసలేంను పేర్కొన్నారు.

విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి ఆయనను నిందితుడిగా, లేదా సాక్షిగా చేస్తామని పేర్కొన్నారు. జిమ్మి, మత్తయ్య అనే రెండుపేర్లు కూడా రేవంత్ రెడ్డి సంభాషణల్లో బయటపడ్డాయని, వారెవరనేది పరిశీలించి, వారిని కూడా విచారిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

రేవంత్ రెడ్డి అరెస్టు సందర్భంలో కాల్‌డేటా రికార్డులను కూడా ఈ వ్యవహారంలో సాక్ష్యంగా ఏసీబీ ఉపయోగించుకోనుంది. స్టీఫెన్‌సన్‌కు ఇంట్లో డబ్బులు ఇచ్చే సందర్భంలో రేవంత్ రెడ్డి అక్కడ ఒక గ్లాస్ మంచినీళ్లు తాగారు. ఆ గ్లాస్‌పై పడిన రేవంత్ వేలిముద్రలను కూడా సాక్ష్యంగా ఏసీబీ అధికారులు సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+