కెసిఆర్ భజన కోసం పోటీపడ్డారు: రేవంత్, దుర్మార్గమన్న ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలా జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన టిడిఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ భజన చేసేందుకు ఆయన వంద మాగధులు పోటీ పడ్డారని ఎద్దేవా చేశారు. సభ్యులను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం పని చేయలేదని విమర్శించారు.

Revanth and Errabelli fires at TRS

ఇంత దుర్మార్గం జరగలేదు: ఎర్రబెల్లి

అసెంబ్లీ సమావేశాలు ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ జరగలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. టిఆర్ఎస్‌తో కాంగ్రెస్, ఎంఐఎంలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదని ఎర్రబెల్లి అన్నారు.

హోంగార్డులు, కానిస్టేబుళ్లు, జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన సమాధారం రాలేదని ఎర్రబెల్లి చెప్పారు. పింఛనుదారులకు న్యాయం జరగలేదని అన్నారు. అర్హులకు పింఛన్లు దక్కడం లేదని ఆరోపించారు. బడ్జెట్ లోపభూయిస్టంగా ఉందని, ఇలాంటి బడ్జెట్‌ను చూడలేదని విమర్శించారు.

అమరవీరుల కుటుంబాలకు సరైనా న్యాయం జరగలేదని ఆరోపించారు. ఒక సభ్యుడిని మాట్లాడనీయకుండా చేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం బండారం బయటపడుతుందనే రేవంత్ రెడ్డిని మాట్లాడనివ్వలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చెప్పినదానిలో తప్పేమైనా చెప్పమంటే.. చెప్పలేకపోయారని అన్నారు. తప్పుంటే స్పీకర్ విధించే ఏ శిక్షకైనా సిద్ధమేనని ఎర్రబెల్లి చెప్పారు.

ప్రజల సంక్షేమం కోసమే బడ్జెక్ మద్దతు: జానా

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్‌కు మద్దతు పలికామని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.
వచ్చే బడ్జెట్‌లోనైనా హామీలు నెరవేర్చేలా కేటాయింపులుండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+