అల్లు అర్జున్ అరెస్ట్‌పై జనసేన నేత సంచలనం.. కావాలనే చేశారంటూ
బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాటపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రాణం పోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడు అల్లు అర్జున్‌ను బాధ్యుడ్ని చేసి, ఆయనపై కఠిన చర్యలకు ఉపక్రమించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎవరి వైఫల్యమో ప్రక్కన పెడితే పుష్ప 2 సినిమా విడుదల రోజున ఒక నిండు ప్రాణం బలయ్యింది.. అప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి అల్లు అర్జున్ గారిని భాద్యున్ని చేసి రాసి రాంపాన్న పెట్టారు..
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) June 5, 2025
నిన్న కర్ణాటకలో క్రికెట్ సంబరాలలో జరిగిన తొక్కిసలాటలో 11 నిండు ప్రాణాలు… pic.twitter.com/g8LguIh3XI
బొలిశెట్టి సత్యనారాయణ తన పోస్ట్‌లో, "సరిగ్గా నిన్న కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. చిన్నస్వామి మైదానంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి" అని ప్రశ్నించారు.

ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుటి వారిపై నిందలు వేయడం కంటే, తప్పు ఎక్కడ జరిగింది అని వెతకడం, ఆ తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. "కక్ష సాధింపు ధోరణి మంచిది కాదు. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలి. భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియంత్రణతో ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి.. బాధ్యతగా వ్యవహారించాలి" అని బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications