ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా, ఏపీలో పార్లమెంట్‌తో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. చెదురుమొదురు ఘటనలు మినహా మూడోదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఎన్నికలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు కాస్తా భిన్నంగా జరిగాయనే చెప్పాలి.. తెలంగాణలో సీఎం ఎన్నికలు గత ఏడాదే జరగడంతో..అక్కడ పెద్దగా హడావిడి కనిపించలేదు.
మీడియా ఫోకస్ అంతా కూడా ఏపీపైనే ఉంచడంతో..ఇక్కడ రాజకీయాలే బాగా హైలేట్ అయ్యాయి. తాజాగా ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో సఖ్యతగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే చేస్తానని, నెగిటివ్ థింకింగ్ ఉండదని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్ తనకు ముఖ్యమని ..పక్క రాష్ట్రాలతో ఎటువంటి వివాదాలు పెట్టుకోమని ఆయన చెప్పుకొచ్చారు. నీటి వివాదాలను కూడా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటామని.. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.అలాగే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications