రేవంత్ రెడ్డి మరో ఓబులేశ్: జూపల్లి, ఎమ్మెల్యేల ధ్వజం

డీఎల్‌ఎఫ్ వ్యవహారంలో విపక్షాలన్నీ ప్రభుత్వానిది తప్పులేదన్నా రేవంత్ మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే గుండు కొట్టించుకోవాలని రేవంత్ రెడ్డికి వారు సవాలు విసిరారు. రేవంత్‌రెడ్డికి బ్లాక్‌మెయిల్ చేయడం అలవాటని, విషయం లేకున్నా.. డీఎల్‌ఎఫ్ కంపెనీని కూడా బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించారు. అది వర్కవుట్ కాలేదని అన్నారు. ఓబులేష్ కూడా గతంలో బ్లాక్‌మెయిల్ చేసి రూ.10-20 లక్షలు సంపాదించాడని, అదే అలవాటుగ కేబీఆర్ పార్కు దగ్గర దొరికిపోయాడని చెప్పారు.
రేవంత్‌రెడ్డి కూడా ఓబులేష్ లెక్క ఇరుక్కుపోపోయాడని అని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చేసిన ఆరోపణలు నిరూపించలేని రేవంత్! నువ్వు గుండు కొట్టించుకుంటవా? నిన్ను ఆడిస్తున్న చంద్రబాబుకు గుండు కొట్టిస్తావా?' ఆయన అని ప్రశ్నించారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో రేవంత్‌రెడ్డి చెడబుట్టి జిల్లా పరువుతీస్తున్నాడని విమర్శించారు. డీఎల్‌ఎఫ్ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, మజ్లిస్ ఏమీలేదన్నా రేవంత్ మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరన్నారు. ఈస్థాయికి దిగజారిన ఎమ్మెల్యే శాసనసభల ఎట్ల ఉన్నరో తెలియడంలేదని అన్నారు..
గతంలో చంద్రబాబు చెప్పినట్లు సభలో అన్నీ అబద్ధాలే చెప్తున్నారని, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిన వ్యవహారాలను ఈ ప్రభుత్వంతో ముడిపెడితె ఎలా? అని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలకు మేలు జరగాలనే మెట్రో భూమి మార్చొద్దంటూ ఈ ముఖ్యమంత్రితో పాటు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా ఫైలుపై సంతకం చేశారని, కానీ రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టాడని ధ్వజమెత్తారు.
ఇక్కడ భూములు అమ్మి, సీమాంధ్రలో ఖర్చు పెట్టిన విషయం మీద చంద్రబాబుగానీ, రేవంత్‌రెడ్డిగానీ ఎందుకు నోరెత్తరు? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గచ్చిబౌలి ప్రాంతంలో రూ. 20 వేల కోట్ల విలువైన 850 ఎకరాల భూమిని బిల్లీరావు, ఐఎంజీలకు కట్టబెట్టిన విషయంపై రేవంత్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, అవినీతిని చట్టబద్ధం చేసిన చంద్రబాబు ఆడించినట్లుగా రేవంత్ ఆడుతున్నాడని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications