జైల్లో ఉండి నీతులా, జగన్ రిలీజ్‌కు బ్రదర్ అడ్డు: రేవంత్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. జగన్ బెయిల్‌కు సోనియా అంగీకరించారని అందుకే, ఆస్తుల కేసు దర్యాఫ్తు మందగించిందన్నారు. తమకు ఏ పార్టీతో చీకటి ఒప్పందాలు నెరపాల్సిన అవసరం లేదన్నారు.
సెజ్‌ల పేరుతో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పెట్టుబడిదారులకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం దర్యాఫ్తు తీరు చూస్తుంటే సిబిఐ పైన విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. జగన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ సునీల్ రెడ్డి బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు.
సిబిఐలో నిజాయితీ కలిగిన అధికారులను ఎందుకు బదలీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్‌కు బెయిల్ రాకుంటే లబ్ధి పొందేది షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌లే అన్నారు. అందుకే జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే బ్రదర్ అనిల్ కుమార్ ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోందన్నారు. ఆరు నెలలుగా ఆయన ఎవరెవర్ని కలిశారో చెప్పాలన్నారు.
జగన్ కేసు మూసివేసే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ కంపెనీలలోకి వచ్చిన విదేశీ నిధుల పైన విచారణ ఇంత వరకు జరగలేదన్నారు. కేసు విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒప్పందంలో భాగంగా జగన్ కేసు మూసేందుకు కుట్ర జరుగుతోందని, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావును కేసులో ఎక్కడైనా ముద్దాయిగా చేర్చారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications