దుంప కాదు గోల్డ్ దుంగలు పండిస్తే: కెసిఆర్‌కు రేవంత్

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖ రావు పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి శనివారం ధ్వజమెత్తారు. నల్ల డబ్బును తెల్లగా మార్చుకొనేందుకు వ్యవసాయరంగానికి మకిలి అంటించవద్దని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ దోచుకున్న సొమ్మును సక్రమమైందిగా చెప్పుకొనేందుకు జగన్ వ్యాపారాలను వాడుకొంటే వసూళ్ల సొమ్మును వైట్ చేసుకొనేందుకు కేసీఆర్ వ్యవసాయానికి మచ్చతెస్తున్నారని వాపోయారు.

జగన్ వల్ల ఆంధ్రపదేశ్ వ్యాపారులు బయటి రాష్ట్రాలవారి దృష్టిలో దొంగలుగా మిగిలిపోయారని, దొంగ సొమ్ముతో పత్రిక పెట్టి మీడియాను సైతం మలినం చేశారని వాపోయారు. మరకలేని ఏకైక వ్యవస్థ వ్యవసాయమేనని రైతులకూ ఆ పరిస్థితి తీసుక రావద్దని కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అగ్రికల్చర్ అనేది రైతుల కల్చర్ అని దాన్ని కరప్షన్‌కు, అక్రమ కలెక్షన్లకు లింకుపెట్టి తెలంగాణ రైతుల పరువు తీయద్దన్నారు.

బంగాళ దుంపలు పండిస్తే ఎవ్వరికీ కోట్ల రూపాయలు రావని, బంగారం దుంగలు పండిస్తే వస్తాయేమోనని వ్యంగంగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలోని దుంపలు కిలో కోటి రూపాయల లెక్కన కొన్నవారికి బి-ఫారం ఇస్తామంటే అప్పుడు సాధ్యమవుతుందన్నారు. ఆయన పండించిన పంటను కొనుగోలు చేస్తున్నవారి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్‌ది బి ఫారాల పంట అన్నారు.

వ్యవసాయంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆయన చెబుతున్న లెక్కలను చూస్తుంటే రాజకీయ వ్యవసాయంలో బి ఫారాల పంట పండిస్తున్నట్లుగా, వాటి అమ్మకం ద్వారా రూ.కోట్లు గడిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న సారవంతమైన భూములన్నింటిని కెసిఆర్‌కు ఇప్పిస్తామని, రైతులకు ఏడాదికి ఎకరాకు ఐదు లక్షల రూపాయలు ఇస్తే చాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులను కెసిఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి ఆహ్వానించాలని, రైతులకు తన సేద్యం మెలకువలను నేర్పించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+