సీఎం చంద్రబాబు సంపద సృష్టికి సాలిడ్ ఎగ్జాంపుల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు చూపిస్తూనే రాష్ట్రానికి ఆదాయ మార్గాల పైన కూడా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉండకుండా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని వివిధ కంపెనీలకు లీజ్ ఇవ్వటం, ప్రభుత్వ భూములు బీడు పడిపోకుండా వాటిని సైతం సాగు చేసేలా, తద్వారా ఆదాయాన్ని సంపాదించేలా చూడటం చెయ్యాలని భావిస్తోంది.

ఖాళీ ప్రభుత్వ భూములతో ఆదాయం
బీడు భూములలో సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి తద్వారా ఆదాయం పొందటం వంటి అంశాలపై సమాలోచనలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో వ్యవసాయ, ఉద్యానవన పంటలను వేసి ఆ గ్రామాలకు ఆదాయం వచ్చేలా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Revenue from government lands in AP Chandrababu govt super plan

Take a Poll

ఖాళీ ప్రభుత్వ భూములను ఉపయోగించేలా ప్లాన్
దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ప్రభుత్వ భూములు నిరుపయోగం కాకుండా, అందుకు తగిన విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ ప్రభుత్వ భూముల నుంచి ఆదాయం తీసుకురావడమే కాకుండా, జిల్లాలోని అన్ని చెరువులను ఫిష్ ట్యాంకులుగా మార్చేందుకు, తద్వారా ఆదాయం సంపాదించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

ఈ ప్లాన్ సక్సెస్ అయితే రైతులకు ఉపాధి
ఒకవేళ ఈ నిర్ణయం అమలైతే ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా ప్రజలకు, రైతులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఖాళీ ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే మరియు భూరికార్డులు అధికారుల నుంచి వివరాలు తీసుకొని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆ భూమికి అనుకూలమైన పంటలను వేసేలా ప్రణాళికలు చేయనున్నారు.

ఉపాధి హామీ పథకంతో జంగిల్ క్లియరెన్స్
ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు వంటివి ఉంటే వాటిని ఉపాధి హామీ పథకం కింద జంగిల్ క్లియరెన్స్ చేయించేలా ప్రతిపాదనలను ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ చెరువులు, కుంటలు ఉన్నాయని అవి వృధాగా ఉండరాదని, వాటి అభివృద్ధికి కూడా ప్రణాళికలను రూపొందించాలని ప్లాన్ చేశారు.

భూముల నిర్వహణను ఆసక్తి గల ఎస్.హెచ్.జిలకు అప్పగించాలని ప్లాన్
రాష్ట్రంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న భూముల్లో వ్యవసాయ, ఉద్యానవన, పట్టు సాగు పంటలతో పాటు మత్స్య సంపద ఏర్పాటుకు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ భూముల నిర్వహణను ఆసక్తి గల ఎస్.హెచ్.జిలకు అప్పగించాలని, ఇందులో విభిన్న ప్రతిభావంతులకు, మహిళలకు, యువతకు తొలి ప్రాధాన్యతను ఇస్తూ వేలం ద్వారా కేటాయించాలని కూడా భావిస్తున్నారు. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తిగానే ఉంచి, తద్వారా ఆదాయం సంపాదించటమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+