ఆర్కే క్షేమమని తేల్చిన వరవరరావు
మావోయిస్టు అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నారని విరసం నేత వరవరరావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేసినట్లు ఒక వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఆర్కే ఆచూకీ గురించి తెలియకపోవడంతో పోలీసుల అదుపులోనే ఆయన ఉన్నారని పౌరసంఘాలు ఆరోపించడం, ఈ విషయమై తక్షణం పోలీస్ శాఖ ప్రకటించాలంటూ ఆర్కే భార్య హైకోర్టుకు వెళ్లడం తెలిసిందే.
ఆర్కే క్షేమంగా ఉన్నారంటూ వరవరరావు తాజా ప్రకటనతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఆర్కే మా వద్ద లేడు అని చెప్పిన కొద్ది గంటల్లోనే విరసం నేత ఒక వార్తా సంస్థలో ప్రకటన చేయడం వెనకున్న అంతరార్థం ఎమిటో పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications