వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు జిల్లాలకు రింగ్‌రోడ్లు: సిఎం కెసిఆర్ ఆదేశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 10వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రోడ్ల అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు సిఎం కెసిఆర్ శుక్రవారం ఆమోదముద్ర వేశారు.

రోడ్ల అభివృద్ధికి రూ.5వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. గ్రామస్థాయిలో 14,500 కిలోమీటర్లను బీటీ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 4160 కి.మీటర్ల కంకర రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 20 వేల కిలోమీటర్ల మట్టిరోడ్లను మరింత మెరుగుపర్చాలన్నారు.

వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో కొత్తగా రింగురోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఉంది.

Ring roads for 4 districts says KCR

రూ. 10 వేల కోట్లకు పైగా భారీ స్థాయిలో ఆర్‌అండ్‌బీ రోడ్లను పునరుద్ధరించనున్నారు. 149 మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారులు సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్లుగా నిర్మించనున్నారు.
మండలాలకు అదనంగా మరో 2వేల కిలోమీటర్ల వరకు సింగల్ రోడ్ల నుంచి డబుల్ రోడ్లుగా మార్చనున్నారు. గోదావరి, కృష్ణా నదులపై అవసరమైనన్ని కొత్త బ్రిడ్జీలు నిర్మాణం చేపట్టనున్నారు.

డిచ్‌పల్లి-నిజామాబాద్, సూర్యాపేట-ఖమ్మం, మధ్య ఫోర్‌వే లైన్లు వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంచాయితీరాజ్ రోడ్లకు సంబంధించి నియోజకవర్గానికి సగటున 385 కిలోమీటర్ల చొప్పున 38,500 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి నిర్ణయించారు. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం నిర్ణయించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday said that their government will build ring roads for 4 districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X