రిషికేశ్వరి చివరి మెసేజ్ తండ్రికి, అన్నయ్యగా పిలిచే జితేందర్‌కు, కమిటీ సిఫార్స్‌లివీ...

గుంటూరు: లవ్ యూ డాడీ, మిస్ యూ అన్నయ్యా... రిషికేశ్వరి ఫోన్ నుంచి వెళ్లిన చివరి సందేశాలు ఇవి. రిషికేశ్వరి ఫోన్ డేటా పైన పోలీసులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఏఫ్రిల్ నుంచి జూలై 14వ దాకా ఆమె చనిపోయిన సమయం వరకు ఎవరెవరితో మాట్లాడింది, ఎవరు ఫోన్లు చేశారనే వివరాలను సేకరించారు.

ఫోన్ నెంబర్ల ఆధారంగా అనుమానితులను పిలిచి విచారిస్తున్నారు. రిషికేశ్వరి జూలై 13వ తేదీన తల్లిదండ్రులతోను, అన్నయ్య అని పిలిచే జితేంద్రతోను మాట్లాడింది. జితేంద్రకు మాత్రం అనేకసార్లు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడినట్లు తేలింది.

జూలై 13వ తేదీన రాత్రి సినిమా హాలు నుంచి కూడా ఆమె జితేంద్రతో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని సమాచారం. సినిమా హాలు బయటకు వచ్చిన రిషికేశ్వరి తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు కాల్ డేటాలో ఉంది. హాస్టల్‌కు వెళ్లాక కూడా జితేంద్రతో ఫోన్లో మాట్లాడింది.

Rishikeshwari suicide: last message to father

మృతి చెందిన రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వాట్సప్ ద్వారా తండ్రికి, జితేంద్రకు సందేశాలు పంపించింది. లవ్ యూ డాడీ.. మిస్ యూ, లవ్ యూ.. మిస్ యూ అని జితేంద్రకు పంపించింది. కాగా, శనివారం నాడు విచారణకు నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను సిఎం చంద్రబాబుకు ఇచ్చింది.

కమిటీ చేసిన సిఫార్సులు ఇవీ...

కేసుపై సత్వర న్యాయవిచారణకు న్యాయస్థానం ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిని నియమించాలి. కేసు విచారణ త్వరగా ముగిసేలా చూడాలి.

ఆర్కిటెక్చర్ కళాశాలలో సిసి కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థినులకు భద్రత పెంచాలి. వసతి గృహాలకు రెగ్యులర్ వార్డెన్‌ను నియమించాలి. రాత్రి తరుచుగా అకస్మిక తనిఖీలు చేయాలి.

బయటివారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. వారిని బయటకు సాగనంపాలి. ఆర్కిటెక్చర్ కళాశాలలో శాశ్వత అధ్యాపకులను నియమించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+